- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
లంచం పట్టాడు....ఏసీబీకి చిక్కాడు..ఏసీబీ దాడులతో పోలీస్ అధికారుల్లో మొదలైన గుబులు
దిశ, తాడ్వాయి: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడుల కలకలం రేపింది.దీంతో ఒక్కసారిగా ఎల్లారెడ్డి నియోజకవర్గ పోలీస్ అధికారులలో గుబులు మొదలైంది.విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్లో స్టేషన్ బెల్ ఇవ్వడానికి 10 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ ఓ ఎస్సై తో పాటు కానిస్టేబుల్ పట్టుబడ్డారు.నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం...లింగంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా సదరు వ్యక్తి కి స్టేషన్ బిల్ ఇవ్వడానికి రూ.10వేల లంచం ఇవ్వాలని ఎస్సై అరుణ్ డిమాండ్ చేసినట్లు తెలిపారు.
అంత మొత్తం డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు.దీంతో పక్కా ప్రణాళికతో గురువారం మధ్యాహ్నం బాధితుడు పోలీస్ స్టేషన్ లో రూ,10 వేలు ఇచ్చే సందర్భంలో ఏసీబీ అధికారులు రెడీ హ్యాండ్ గా ఎస్ఐ అరుణ్ తో పాటు కానిస్టేబుల్ రామస్వామి (రైటర్)ను పట్టుకున్నట్లు తెలిపారు.పట్టుబడిన నిందితులను నాంపల్లి లోని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు.ఈ ఏసీబీ దాడిలో ఇన్స్పెక్టర్ వేణు కుమార్,నగేష్,శ్రీనివాస్,ఉన్నారు.