ఏడో విడత సాగు నీటి విడుదల..

by Aamani |
ఏడో విడత సాగు నీటి విడుదల..
X

దిశ,నిజాంసాగర్: నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న యాసంగి పంటలకు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా ఏడో విడత నీటిని విడుదలను సోమవారం ప్రారంభించినట్లు నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న లక్షా 25 వేల ఎకరాలకు ఏడు విడతల్లో 11 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నామని, ఇప్పటివరకు ఆరు విడుదల్లో 9.61 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

చివరి ఆయకట్టు పంటలు చాలా వరకు చేతికి అందడంతో ప్రస్తుతం ఏడవ విడత నీటిని డిస్ట్రిబ్యూటరీ ఒకటి నుంచి 39 వరకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ తక్కువగా ఉన్నందున ఆయకట్టు రైతులు నీటిని వృధా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1405.00 అడుగులు 17.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.94.00 అడుగుల 6.17 టీఎంసీలు వద్ద ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ప్రధాన కాలువ ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈ శివప్రసాద్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed