Seasonal Diseases: సీజనల్‌ వ్యాధులు..జర భద్రం

by Naveena |   ( Updated:2024-10-25 15:00:23.0  )
Seasonal Diseases: సీజనల్‌ వ్యాధులు..జర భద్రం
X

దిశ, ఆలూర్ : ఆర్మూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో శుక్రవారం ఫ్రైడే- డ్రై డే ( Friday- Dry day )కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధుల (Seasonal Diseases )గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలన్నారు. ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత కుండలు, పనికిరాని వస్తువులను ఉంచుకోరాదని, వాటిలో వర్షపు నీరు పడి దోమల లార్వా వృద్ధి చెంది డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రభలుతాయని అన్నారు. దోమ పుట్టుక గురించి, దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి దోమల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ కృష్ణమూర్తి, ఆఫీసర్ సాయిలు, రాజవ్వ, పద్మా నరేందేర్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story