సర్పంచ్ అభ్యర్థులు సూపర్ ఫాస్ట్..

by Sumithra |
సర్పంచ్ అభ్యర్థులు సూపర్ ఫాస్ట్..
X

దిశ, గాంధారి : సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే సర్పంచ్ అభ్యర్థులు బోనాల పండగను పునస్కరించుకొని అదే మంచి రోజు అని భావించి తాయిలాలకు తెర లేపినారు. బోనాల పండగ ఊరి పండుగ కావడంతో దొరికిందే తరువాయి అనుకొని సర్పంచ్ అభ్యర్థులు ప్రజలను ఇప్పటి నుంచే మచ్చిక చేసుకుంటున్నారు. సర్పంచ్ అభ్యర్థుల బరిలో నేనున్నానంటూ గుర్తించేందుకు ముందస్తు వ్యూహంగా బోనాల పండగ నుంచి తాయిలాలతో ప్రజలకు మేమున్నాం అంటూ చెప్పకనే చెబుతున్నారు.

బోనాల పండగ పుణ్యమా అని అది కూడా ఊరి పండగ కావడంతో అందరూ ఒక్క దగ్గర ఉన్న తరుణంలో సర్పంచ్ అభ్యర్థి బరిలో నేనున్నాను అంటూ చెప్పకనే చెబుతున్నారు. ఈ సందర్భాలు ముందస్తుగా వచ్చే సర్పంచ్ ఎన్నికలకు పోటీలో ఉన్నాను అనే చెప్పేందుకు ప్రజలను ఇప్పటినుంచి మచ్చిక చేసుకుంటున్నారు. బోనాల్లో పాత నాయకులు, కొత్త నాయకులు, రాబోయే పోటీ చేసి సర్పంచ్ అభ్యర్థులు కలిసి బోనాల పండుగలో పాల్గొని ప్రజలలోకి నేను పోటీ చేస్తున్నానని ఒక సంకేతాన్నిస్తూ తాయిలాలకు చోటు ఇవ్వడంతో ఈయన సర్పంచి రేసులో ఉన్నాడు అని ఇట్టే అర్థమవుతుంది.

సర్పంచ్ నోటిఫికేషన్ వెలువడక ముందే..

రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎలక్షన్లు త్వరలోనే పూర్తి చేస్తాం అని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో జరిగిన సభలో బహిరంగంగానే చెప్పారు. ఇదే అదునుగా చేసుకొని సర్పంచ్ అభ్యర్థులు ఇప్పటినుండి ప్రజలకు చేరువై వారి నాడి పట్టుకొని ఆయా సంఘం వారితో మంతనాలు జరుపుతున్నారు. ఏదేమైనా నోటిఫికేషన్ వెలువడక ముందే అభ్యర్థులు తమ ప్రత్యర్థి బలాబలగాలు ముందస్తుగా అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే ఆయా సంఘాలతో టచ్ లో ఉంటున్న అభ్యర్థులు..

సర్పంచ్ బరిలో ఉంటున్న అభ్యర్థులు ఆయా కుల సంఘాల అధ్యక్షులతో ఇదివరకే మంతనాలు జరుపుతూ కుల సంఘాల వారితో ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎవరి సంఘం వారు వారు అధ్యక్షులు ఏది చెబితే అది ఆ సంఘం సభ్యులందరూ వింటారని అవి తమకు అనువుగా మారి విజయ తీరానికి చేరుస్తాయని వారి ప్రగాఢ నమ్మకం.

ఏదేమైనా సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువలకు ముందే అభ్యర్థులు ఇప్పటినుండే పావులు కలుపుతున్నారు. అయితే పాత వారు కొత్తవారిని ఎలా ఢీకొనాలి అనేది కోసం మెరుపుగా మారింది. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు సర్వత్ర ఉత్కంఠంగా మారింది.

Next Story

Most Viewed