అడ్డదారిలో నిబంధనలకు తూట్లు.. అక్రమ పద్ధతిలో వెంచర్..

by Sumithra |
అడ్డదారిలో నిబంధనలకు తూట్లు.. అక్రమ పద్ధతిలో వెంచర్..
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలో గల కోటార్ మూర్, పెర్కిట్ రెవెన్యూ గ్రామాల్లో నిబంధనలకు తూట్లు పొడిచి అక్రమ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఆహారా వెంచర్ దందా జోరుగా జరుగుతుంది. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో 44, 63 జాతీయ రహదారులను ఆనుకొని రహదారుల జంక్షన్ వద్ద ఈ అక్రమ వెంచర్ దందా వెంచర్ నిర్మాణదారుల ఇష్టారాజ్యమైంది. ఈ జాతీయ రహదారుల కూడలిలో దర్జాగా అసైన్మెంట్ భూమి, నిజాంసాగర్ కాలువ స్థలాలను దర్జాగా కలుపుకొని వెంచర్ ను ఏర్పాటు చేసి అమ్మకాలు చేపడుతున్నారు. ఈ వెంచర్లో అమాయక ప్రజలను మభ్యపెట్టి అక్రమ పద్ధతిలో ఏర్పాటు చేసిన వెంచర్లో అమాయక జనానికి ప్లాట్లను అంటగడుతున్నారు. అక్రమ పద్ధతిలో వెలిసిన ఈ వెంచర్ పై చర్యలు తీసుకోవలసిన అధికారులు.. స్థానిక ప్రజాప్రతినిధులు తమకేం పట్టనట్లుగా ఆమ్యామ్యాలకు అలవాటు పడి ఎకరాల చొప్పున పర్సెంటేజీలు తీసుకుంటున్నారని ఆర్మూర్లో జనం జోరుగా చర్చించుకుంటున్నారు.

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారుల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఆహార రియల్ ఎస్టేట్ వెంచర్ ను పెర్కిట్ రెవెన్యూ గ్రామంలోని 386-2,386-3 సర్వేనెంబర్, కోటర్ మూర్ రెవెన్యూ గ్రామానికి చెందిన 41-2 సర్వే నంబర్ లోని సుమారు 10 గుంటల అసైన్మెంట్ భూమిని.. నిజాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన 82-2 కాలువ ఉప కాలువకు చెందిన సుమారు 30 గుంటల స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా కబ్జా చేసుకొని వారి వెంచర్లో కలుపుకొని ప్లాట్లుగా అమాయక ప్రజలకు అమ్మకాలు చేస్తున్నారు. వెంచర్ ఏర్పాటు సమయంలో రెవెన్యూ అధికారులు అసైన్మెంట్, నిజాంసాగర్ కాలువల ప్రభుత్వ స్థలాన్ని తప్పకుండా నాలా కన్వర్షన్ లో టోంచు మ్యాప్ ను రియల్ ఎస్టేట్ వ్యాపారులు మున్సిపల్ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.

కానీ రెవెన్యూ అధికారులు ఏ తీరుగా చూపించారో ఏమో.. కానీ.. మున్సిపల్ అధికారులకు వెంచర్ ఏర్పాటు సమయంలో ఎలాంటి పత్రాలు సమర్పించారో తెలియదు కానీ.. వెంచర్ ఏర్పాటు స్థలంలో మాత్రం నిజాంసాగర్ కాలువ, అసైన్మెంట్ భూముల ఆనవాళ్లు కనబడకుండా వెంచర్ స్థలంలో ఆ స్థలాలను కలుపుకొని వెంచర్ నిర్మాణదారులు దర్జాగా వెంచర్ ను ఏర్పాటు చేశారు. దర్జాగా వెంచర్ ను ఏర్పాటు చేస్తుండడం పై రెవెన్యూ అధికారులకు.. మున్సిపల్ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టి ఉంటాయని ఆర్మూర్లో జనం కోడైకూస్తుంది. ఆర్మూర్ మున్సిపల్ లో ఏర్పాటు చేస్తున్న ఆహార వెంచర్లో జరుగుతున్న అక్రమాలపై స్థానిక ప్రజాప్రతినిధులు.. అధికారులు.. భారీ మొత్తంలో ముడుపులు అందుకొని .. అక్రమాలను సక్రమాలుగా మార్చేందుకు.. అధికార.. ప్రజాప్రతినిధులు పాట్లు పడుతున్నట్లు కనబడుతుంది.

నిజాంసాగర్ కాలువ స్థలాలు ప్రస్తుతానికి కబ్జాకు గురై రియల్టర్లు దర్జాగా వ్యాపారం చేసుకొని అమ్మకాలు జరిపిన తర్వాత భవిష్యత్తులో ఆయా కాలనీలో కాలువల పూడ్చివేతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తప్పక ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఆర్మూర్ ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, ఇతర రెవెన్యూ అధికారులు కబ్జాకు గురవుతున్న అసైన్మెంట్ భూమి.. నిజాంసాగర్ కాలువ స్థలాలను గుర్తించి.. ఆ స్థలాలను కబ్జా చేసి వెంచర్లో కలిపిన సదరు వెంచర్ నిర్మాణదారుల పై చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed