భీంగల్ పట్టణ అభివృద్ధికి రూ. 12 కోట్ల అంచనా బడ్జెట్

by Mahesh |
భీంగల్ పట్టణ అభివృద్ధికి రూ. 12 కోట్ల అంచనా బడ్జెట్
X

దిశ, భీంగల్: భీంగల్ పట్టణ అభివృద్ధికి గాను 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.12 కోట్ల 10 లక్షల 80 వేల అంచనాతో బడ్జెట్ ను కేటాయించడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ అన్నారు. సోమవారం మున్సిపల్ మీటింగ్ హాల్ లో నిర్వహించిన సాధారణ వార్షిక అంచనా బడ్జెట్ సమావేశంలో మాట్లాడారు.ఈ కేటాయింపు వార్షిక బడ్జెట్ నుండి వేతనాలకు రూ.1 కోటి 20 లక్షలు,గ్రీన్ బడ్జెట్ కింద రూ.30.76 లక్షలు,పారిశుధ్య నిర్వహణ రూ.70.15 లక్షలు,విద్యుత్ ఛార్జిలకు రూ.6 లక్షలు, ఇంజనీరింగ్ విభాగం నిర్వహణకు రూ.25 లక్షలు, సాధారణ పరిపాలన వ్యయం కింద రూ.29 లక్షలు, పట్టణ ప్రణాళిక విభాగం కింద రూ.3.5 లక్షల అంచనాతో బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. మిగులు బడ్జెట్ నుండి 1/3 వంతు బాలన్స్ బడ్జెట్‌ను వెనుకబడిన ప్రాంతాలు, ఎస్సీ,ఎస్టీ ప్రాంతాల అభివృద్ధికి కేటాయించగా మిగులు నిధులను పట్టణంలోని వార్డులకు గాను వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించినట్లు తెలిపారు.ఈ సమావేశం లో వైస్ చైర్మన్ గున్నాల భరత్, కమిషనర్ వై. రామకృష్ణ, అకౌంటెంట్ విజయ్ కుమార్, కౌన్సిలర్‌లు సిబ్బంది శ్రీధర్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed