- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎట్టకేలకు.. మూడు నెలలకు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో పీడీఎస్, సీఎంఆర్ బియ్యంలోడ్ లతో కలిగిన లారీలను, డీసీఎం ఎత్తుకెళ్లే ఒక ముఠాను నిజామాబాద్ పోలిస్ లు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. పీడీఎస్ బియ్యం సేకరించి రైస్ మిల్లులకు, ఇతర రాష్ర్టాలకు అమ్ముకునే వారిని టార్గెట్ చేస్తు దొంగతనాలు చెయ్యడం వారి పని అని తెలిసింది. సంబందిత మూఠా గత ఎడాది సీఎంఆర్ లోడ్ లారీని ఎత్తుకెళ్లి పోలిస్ లకు చిక్కింది. జీపీఎస్ ట్రాకింగ్ కలిగిన లారీని ఎత్తుకెళ్లిన మూఠా ఎకంగా సంబంధిత లారీ కాంట్రాక్టర్ ను పోన్ లో బెదిరించిన వారిని పట్టుకునేందుకు పోలిస్ లకు మూడు నెలల కాలం పట్టింది. అంతే గాకుండా కాంట్రాక్టర్ తో పాటు సివిల్ సప్లై అధికారులు ఫిర్యాదు చేసిన నిజామాబాద్ నగరానికి చెందిన దొంగల గురించి ఆధునిక టెక్నాలజీ కలిగిన రోజులలో 3 నెలల సమయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
నిజామాబాద్ సివిల్ సస్లై కాంట్రాక్టర్ సిరాజ్ కు చెందిన ఏపీ 25 ఎన్ 5793 లారీ 580 బస్తాలలోడుతో మల్లారంలోని ఎప్ సీఐ గోదాం వద్ధ నుంచి ఆగంతకులు ఎత్తుకెళ్లారు. అది పౌరసరపరాల శాఖ కాంట్రాక్ట్ కలిగిన లారీ కావడంతో దానికి కాంట్రాక్టర్ జీపీఎస్ డివైజ్ ను అమర్చారు. డిసెంబర్ 8న లారీని నిజామాబాద్ ముజాహిద్ నగర్ కు చెందిన గ్యాంగ్, నిజాం కాలనికి చెందిన ఒక బ్రోకర్ అదేశాల మేరకు చోరి చేసినట్టు తెలిసింది. సంబంధిత లారీలోని బియ్యంను వర్నిమండలం ఘన్ పూర్ లోని ఓ రైస్ మిల్లు యజామానికి అమ్మకం చేసేందుకు బేరసారాలు నడిపారు. అయితే సంబంధిత లారీ యజమాని రూరల్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి జీపీఎస్ ట్రాకింగ్ తో పట్టుకునే ప్రయత్నాలు చేశారు.
అయితే వర్నిపరిసర ప్రాంతాలలో లారీ ఉండటంతో దొంగతనం చేసిన, ప్రజల నుంచి సేకరించిన రేషన్ బియ్యంను కొనుగోలు చేసే మిల్లర్ కు కాంట్రాక్టర్ తన లారీ చోరి విషయం తెలిపాడు. అక్కడే ఉన్న లారీ చోరి చేసిన దొంగల ముఠా ఏకంగా కాంట్రాక్టర్ కు పోన్ చేసి దమ్కి ఇచ్చారు. లారీ ఫలానా ప్రాంతంలో వదిలేశాం లారీని సరుకును తెచ్చుకో కేసు వాఫస్ తీసుకో లేదంటే అని బెదిరించారు. దానితో కాంట్రాక్టర్ మాత్రం కేసువాపస్ ససెమీరా అని చోరులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో తమ లారీలను డీసీఎంలను ఎత్తుకెళ్లారు అని తెలిపారు.
సరుకును అమ్మేసి లారీలను పార్టు పార్టులుగా విక్రయిస్తారని తెలిసింది. ఇటీవల కాలంలో పీడీఎస్ మాముళ్ల వ్యవహరంలో రౌడిషిటర్ మర్డర్ కావడంతో పోలిస్ శాఖ సీరియస్ గా తీసుకోవడంతోనే నగరంలోని చోరుల ముఠా పోలిస్ లకు చిక్కింది లేకపోతే మరేంత కాలం పడుతుందో అనూ విమర్శలు ఉన్నాయి. గతంలో సారంగపూర్ లోని ఓ రైస్ మిల్లు నుంచి 25 లక్షల విలువైన దాన్యంను ఓ ముఠా చోరి చేసింది. అ కేసు రెండు సంవత్సరాలు గడిచిన కొలిక్కి రాలేదు. గతంలో నిజామాబాద్ రూరల్ సౌత్ సీఐగా పనిచేసిన అధికారి కేసును మటాష్ చేసినట్లు వినికిడి.