మొద్దు నిద్ర వీడని ఆర్మూర్ మున్సిపల్ అధికారులు

by Mahesh |
మొద్దు నిద్ర వీడని ఆర్మూర్ మున్సిపల్ అధికారులు
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో ఆదాయానికి భారీగా గండి పడుతుందని ఇటీవల దిశ దిన పత్రికలో కథనం ప్రచురితమైనప్పటికీని మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్మూర్,పెర్కిట్,మామిడిపల్లి, కోటార్ మోర్ తదితర ఏరియాల్లో అనుమతులకు విరుద్ధంగా వందల సంఖ్యలో ఇండ్ల నిర్మాణాలు, అక్రమ షెడ్ల నిర్మాణాలు చేయించి వ్యాపారాలు దర్జాగా చేస్తున్న ఆర్మూర్ మున్సిపల్ లోని మున్సిపల్ డిపిఓ విభాగం, ఇతర అధికారులు చర్యలు తీసుకోవడంలో మౌనం ప్రదర్శిస్తూ ముడుపులు దండు కుంటున్నారని ఆర్మూర్లో విమర్శలు గుప్పుమంటున్నాయి.

ఆర్మూర్ మున్సిపల్ లో విధులు నిర్వహించే అధికారులకు మున్సిపల్ పరిధిలోని, మున్సిపల్ పాలకవర్గంలోని పలువురి కౌన్సిల్ సభ్యుల నుంచి అధికారులు తీవ్ర ఒత్తిళ్ళను ఎదుర్కోవడంతో చర్యలు తీసుకునే విషయంలో జంకుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ లో మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల ప్రమేయం లేనిదే మున్సిపల్ అధికారులు ఏం చేయలేని పరిస్థితి దాపురించింది. ఆర్మూర్లో వందలాది అక్రమ నిర్మాణాలు దర్జాగా జరుగుతున్న ఆ నిర్మాణ పనులకు కొలతలు తీయించి డబుల్ టాక్స్లను అధికారులు వేయాల్సి ఉన్న మున్సిపల్ కౌన్సిలర్ల తీవ్ర ఒత్తిడితో.. తూతూ మంత్రంగా కొలతలు తీస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు.

ఇండ్ల నిర్మాణాల విషయంలో ఇంటి నిర్మాణాలు పూర్తి కాకుండానే ఒకటో అంతస్తుకి ఇంటి నంబర్లను కేటాయిస్తూ టాక్స్‌లను జారీ చేస్తూ,తర్వాత ఆ ఇళ్ల నిర్మాణదారులు రెండు మూడు అంతస్తులను కట్టుకొని మున్సిపల్ కు ఎలాంటి టాక్స్‌లను చెల్లించడం లేదు. కనీసం ఆ ఇండ్ల టాక్స్ రివిజన్ చేయకుండా మున్సిపల్ కౌన్సిలర్ల ఒత్తిళ్లతో కథ ను మామ అంటూ నడిపిస్తున్నారు. గృహ అవసరాల పేరిట అనుమతులు పొందుతూ కమర్షియల్ నిర్మాణాలను చేసుకుంటున్న చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు అటువైపు కనీసం కన్నెత్తి చూడకుండా, ఇండ్ల నిర్మాణాల విషయంలో నార్మల్, ఫాస్ రూపేనా ఇంటి నిర్మాణాలకు కొలతలు తీయించి టాక్స్ లు వేసి మున్సిపల్ ఆదాయం పెరిగేలా చూడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా చూసీచూడ నట్లుగా వ్యవహరిస్తూ కాలం గడుపుతున్నారు.

ఆర్మూర్లో జాతీయ రహదారి 63 నెంబర్ రోడ్డు వెంట ఒక వ్యక్తికి చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్ స్థలంలో.. ఇంకా వెంచర్ నిర్మించని ఖాళీ 22 సర్వే నంబర్ ఖాళీ స్థలంలో మొత్తం 19 దుకాణాలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మున్సిపల్ కు ఎలాంటి టాక్స్ లు చెల్లించకుండా, ట్రేడ్ లైసెన్సులు తీసుకోకుండా దర్జాగా దుకాణాలకు స్థలాలను కిరాయిలకు ఇచ్చి సుమారు ప్రతి నెల 4 లక్షల వరకు డబ్బులు దండుకుంటూ వ్యాపారాలు చేయిస్తున్నాడు. ఆర్మూర్ లో రోడ్డుపై ఖాళీ టెంట్లను వేసుకొని, తోపుడుబండ్లను నడుపుకుంటూ వ్యాపారాలు చేసే, ఒక దగ్గర కూర్చుని కూరగాయలు అమ్ముకునే రైతుల వద్ద నుంచి తై బజార్ వసూళ్లు చేసే మున్సిపల్ అధికారులు .. అనుమతులు లేకుండా ప్రధాన రహదారుల వెంబడి ఎన్నో షెడ్లను నిర్మించుకొని అక్రమ వ్యాపారుల వైపు కన్నెత్తి చూడక పోవడం గమనార్హం.

జాతీయ రహదారి వెంబడి ఎలాంటి మున్సిపల్ నిర్మాణ అనుమతులు లేకుండా మార్బుల్, స్టీల్, వెల్డింగ్, పాత ఇనుప సామాను, సిమెంట్ ఇటుకల తయారీ, హోటల్ , విగ్రహాల తయారీ, పూల మొక్కల అమ్మకాలు తదితర వ్యాపారాలు నిర్వహించేందుకు దర్జాగా అక్రమ కౌన్సిలర్ల ఇమ్మతితో షెడ్లను నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారు. ఇదే లెక్కన పెర్కిట్ కొటార్ మూర్ లోని 44,63 జాతీయ రహదారుల జంక్షన్ నుంచి మామిడిపల్లి జాతీయ రహదారి వెంబడి శివారులో వరకు, నిజామాబాద్ రోడ్డు లోని దోబీ ఘాట్ శివారు ప్రాంతమైన అంకాపూర్ గ్రామ పొలిమేర వరకు, నిర్మల్ రోడ్డు లోని పెర్కిట్ శివారు వరకు ఎలాంటి అనుమతులు లేకుండా వందల సంఖ్యలో షెడ్లను నిర్మాణాలు చేసుకొని మున్సిపల్ పాలకవర్గ కౌన్సిల్ సభ్యుల అండదండలతో దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్నారు.

మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలంటే వారి మున్సిపల్ బిల్ కలెక్టర్ల చేతనే వార్డుల వారిగా అనుమతులు లేని టాక్స్లు చెల్లించని వాటి ఆధారాలు తెప్పించుకొని వెనువెంటనే మున్సిపల్ ఆదాయాన్ని పెంచవచ్చు కానీ మున్సిపల్ కమిషనర్ ఎందుకు మౌనం వహిస్తున్నారో.... నని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ పనితీరు పట్ల ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ కు ఆదాయం పెరిగే అవకాశాలపై దృష్టి సారించకుండా ఆర్మూర్ పట్టణంలో గతంలో ఏర్పడ్డ వాళ్ళు లేఔట్లు, పలువురికి కేటాయించిన ఇంటి నంబర్ల ఓనర్లకు నోటీసులను పంపిస్తూ ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి వారిని పిలిపించుకొని వారితో సంప్రదింపులు చేస్తూ సెటిల్మెంట్లు మున్సిపల్ అధికారి చేస్తున్నట్లు ఆర్మూర్లో ప్రజలు చర్చించుకుంటున్నారు.

పలువురు రియల్ వెంచర్లకు రిజిస్ట్రేషన్ చేయవద్దని ఆర్మూర్ సబ్ రిజిస్టర్ ఉత్తరాలు రాస్తూ ఆ రిజిస్ట్రేషన్లు సైతం మున్సిపల్ అధికారి నిలుపుతూ బేరసారాలకు పాల్పడుతున్నట్లు ఆర్మూర్లో విమర్శలు గుప్పుమంటు న్నాయి. ఈ పనులకు ఇచ్చే టైం ఆ మున్సిపల్ ఉన్నతాధికారి మున్సిపల్ ఆదాయం పెరిగేలా అక్రమాకులపై కొరడా ఝులిపించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మున్సిపల్ కు ఆదాయం సమకూరే అక్రమ ఇండ్ల, షెడ్ల నిర్మాణదారులు పై, అక్రమ వ్యాపారస్తులపై ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజులు ఇతర అధికారులతో కలిసి చర్యలు తీసుకొని మున్సిపల్ ఆదాయం పెరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రాజును దిశ దినపత్రిక ప్రశ్నించగా.. ఆర్మూర్ లోని అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి ఆ నిర్మాణాల టాక్స్‌లను రివిజన్ చేయించే పనిలో ఉన్నాం. ప్రధాన రోడ్ల వెంబడి అక్రమ పద్ధతిలో నిర్మించిన షెడ్లలో వ్యాపారాలను గుర్తించి వాటి నుంచి మున్సిపల్ కు ఆదాయం వచ్చేలా టాక్స్ విధిస్తాం. అనంతరం ఆ వ్యాపారులకు ట్రేడ్ లైసెన్సులు జారీ చేస్తాం. మున్సిపల్ కమిషనర్ ఇలా చెబుతున్న వాస్తవానికి అక్రమ నిర్మాణాలను షెడ్లను గుర్తించి టాక్స‌లను పెంచేలా ఆర్మూర్లో అధికారులు పనిచేస్తున్నట్లు కనబడడం లేదు. అధికారుల ట్యాక్స్ పెంపు ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో మున్సిపల్ ఆదాయానికి దారులు ఎప్పుడు తెరుచుకుంటాయే చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed