తెరుచుకోనున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు..

by Sumithra |
తెరుచుకోనున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు..
X

దిశ, బాల్కొండ : మహారాష్ట్రలో నిర్మించిన బాబిలి ప్రాజెక్టు గేట్లు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జులై 1 నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు ఎత్తి ఉంచాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం జులై 1వ తేదీన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవనున్నారు. ఈ గేట్లు తెరిచి ఉంచడంతో వర్షాకాలం సీజన్ లో కురిసిన వర్షం నీరు, లోబాబ్లీ దిగువన వున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి నేరుగా వచ్చి చేరుతోంది.

ఈ సందర్భంగా ఎస్సారెస్పీ అధికారులు సోమవారం ఉదయం నుంచి బాబ్లీ గేట్లు ఎత్తే కార్యక్రమంలో పాల్గొంటారు. బాబ్లీ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 2.74 టీఎంసీలు కాగా శనివారం సాయంత్రానికి 0.2 టీఎంసీల నీటి నిలువ ఉందని తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో 1059.30 అడుగులు 9.905 టీఎంసీల నీటి నిల్వ వుంది. ఈ సీజన్ లో వర్షాలతో 3.550 టీఎంసీ వర్షం నీరు వచ్చి చేరిందని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed