బెల్ట్ షాప్ పై దాడి.. లక్ష రూపాయలు విలువ చేసే మద్యం స్వాధీనం

by Aamani |
బెల్ట్ షాప్ పై దాడి.. లక్ష రూపాయలు విలువ చేసే మద్యం స్వాధీనం
X

దిశ, లింగంపేట్ : లింగంపేట్ మండలంలోని మోత గ్రామంలో నిర్వహిస్తున్న బెల్ట్ షాప్ పై దాడి చేసి లక్ష రూపాయలు విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన బద్దం ప్రతాప్ రెడ్డి ఇంటిపై దాడి చేసినట్లు తెలిపారు. బెల్ట్ షాపులు నిలువ ఉంచిన బీర్ బాటిల్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రతాప్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు దాడిలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed