- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అటానమస్ కాలేజీల్లో ఫీజుల లొల్లి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రైవేట్ కళాశాలలో తమ అడ్మిషన్ల కోసం ఉపకార వేతనాలు వచ్చే విద్యార్థులను చేర్చుకుని ఫీజును అందులో మినహాయించుకోవడం కొంత కాలంగా జరుగుతుంది. దోస్తు పేరిట అడ్మిషన్లను స్వీకరిస్తున్న సమయంలోనూ ప్రైవేట్ కళాశాలలో ఇదే విధంగా వ్యవహరించి ఫీజులను ఉపకార వేతనాలను మినహాయించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలను విడుదల చేయడం లేదు. దాంతో కోట్ల రూపాయల రీయెంబర్స్ మెంట్ ఫీజును ప్రైవేట్ యజమాన్యాలకు బకాయి పడ్డాయి.
ఈ నేపథ్యంలో ప్రైవేట్ యజమాన్యాలు కచ్చితంగా ఫీజులను చెల్లించి ఉపకార వేతనాలు జమ అవుతాయి కాబట్టి అక్కడ తీసుకోవాలని పేచి పెడుతున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తంతే. ఫీజు రీయెంబర్స్ మెంట్ బకాయిల ప్రభావం ప్రైవేట్ తో పాటు ప్రభుత్వ కళాశాలలపై పడింది. ప్రభుత్వ కళాశాలల్లో స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన కళాశాలలో సెల్ప్ ఫైనాన్స్ కోర్సులను నిర్వహిస్తున్నారు. అందులో చేరిన వారు ఫీజును విద్యార్థులు కొంత భాగం మిగిలిన సొమ్మును ఉపకార వేతనాల రూపంలో కోతలు విధించడం సాధారణమైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధ శతాబ్ధపు చరిత్ర కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీలో రీయెంబర్స్ మెంట్ బకాయిల పేచి వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో చదువుకుని డిగ్రీలు పూర్తి చేసిన వారికి ఫీజు బకాయిలు చెల్లించలేదని సర్టిఫికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అది ప్రైవేట్ కళాశాల అనుకుంటే పొరపాటే. అది పేరొందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు గత కొన్ని రోజులుగా తమ సర్టిఫికెట్లను ఇవ్వాలని ఆందోళనకు దిగుతున్నారు. దానికి కళాశాల ప్రిన్సిపల్ ససేమీరా అంటున్నారు.
ఎందుకంటే అడ్మిషన్ల సమయంలో విద్యార్థులు అడ్మిషన్ల సెల్ప్ అగ్రిమెంట్ లో ఇచ్చిన హామీ మేరకు సర్టిఫికెట్లను ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. నిజామాబాద్ గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు న్యాక్ ఏ అక్రిడేషన్ తో పాటు అటానమస్ హోదా ఉంది. దాదాపు డీమ్డ్ యూనివర్సిటీ హోదా కలిగిన కళాశాలగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గిరిరాజ్ కళాశాల మంచి పేరు ప్రఖ్యాతాలు కలిగి ఉన్నాయి. ప్రభుత్వ కళాశాల కావడంతో చాలా మంది విద్యార్థులు ఇక్కడ చేరి చదివేందుకు ఆసక్తి చూపుతారు.
ప్రతి యేడాది కనీసం 1560 మంది కొత్తగా అడ్మిషన్ తీసుకుని ఈ కళాశాలల్లో ఇటీవల దోస్తు ప్రక్రియలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరారు. అడ్మిషన్లు పొందడం అక్కడ సెల్ప్ ఫైనాన్స్ కోర్సులు ఎక్కువగా ఉండడంతో అడ్మిషన్లు దొరకని పరిస్థితి ఉంది. అదే సమయంలో 2021 - 22లో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి మొండికేస్తున్నారు. దాదాపు 900 మంది విద్యార్థులకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. సంబంధిత విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయెంబర్స్ మెంట్ బకాయిలు దాదాపు 16 నుంచి 20 లక్షల వరకు ఉంటాయని సమాచారం.
దానిపై విద్యార్థులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా న్యాయం దక్కకపోవడంతో గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. డిగ్రీ పూర్తియింది సర్టిఫికేట్ల కోసం కళాశాలకు వస్తే ప్రభుత్వం పీజు రియంబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని కాబట్టి ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లను తీసుకువెళ్లాలని అధికారులు చెబుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. అడ్మిషన్ లు, ఉద్యోగాల కోసం పైనల్ మెమోలతో పాటు ఇతర సర్టిఫికేట్ల కోసం అడిగితే బకాయిలు చెల్లించి తరువాతనే సర్టిఫికెట్లు అడగాలని అధికారులకు పిర్యాదు చేసిన స్పందన లేదని వాపోతున్నారు.
మరోవైపు గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సెల్ప్ పైనాన్స్ కోర్సులలో చదివే విద్యార్ధులకు ఉపకార వేతనాలు రూ.4 వేల వరకు వస్తాయి. వారికి అడ్మిషన్ ల సమయంలో సెల్ప్ పైనాన్స్ కోర్సు విద్యార్థులు పీజు క్లీయర్ చేసిన తరువాతనే సర్టిపికేట్లు తీసుకుంటామనేది అగ్రిమెంట్ ఉంటుంది. ఈ విషయం ఉన్నత విద్యామండలికి తెలుసు. ఉపకార వేతనాలు రాలేదని వారు పీజులు చెల్లించకపోతే వారికి సర్టిఫికేట్ల జారీ కుదరదని చెప్పాం. వారు పీజులు కట్టి సర్టిఫికెట్లను తీసుకోవాలి.