కేంద్రం నిధులతోనే జుక్కల్ అభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే అరుణ

by Sumithra |
కేంద్రం నిధులతోనే జుక్కల్ అభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే అరుణ
X

దిశ, జుక్కల్ : జుక్కల్ మండలం కేంద్ర నిధులతో అభివృద్ధి చెందిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార అన్నారు. సోమవారం బిజ్జవాద్, అత్తల్ వాడి గ్రామాల్లో ప్రజా గోస- బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో భరోసా ఇస్తుందని అన్నారు. అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయించిందని ఆమె అన్నారు. 180 కోట్లు రూపాయలు కేటాయించారని తెలిపారు. జుక్కల్ మండల కేంద్రంలో ఎన్నో అభివృద్ధికి పనులు చేశామని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు కేంద్ర నిధులతోనే నిర్మించారని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల నుండి రేషన్ బియ్యం ఇస్తలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో హయాంలో ఎలాంటి అభివృద్ధి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జుక్కల్ బస్టాండ్ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నిర్మించిందన్నారు. జుక్కల్ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుందని దాన్ని పట్టించుకునే నాయకుడు లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో నిర్మించిన జుక్కల్ బస్టాండ్ కనిపిస్తుంది. జుక్కల్ బస్టాండ్ ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆమె అన్నారు. ఒక్కసారి బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని ఆమె అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఆమె అన్నారు. ఒకసారి ఆమెకు అవకాశం ఇస్తే జుక్కల్ ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటరమణ, శివాజీ పటేల్, ప్రశాంత్ పటేల్, పుట్టావా రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed