అడుగడుగునా గుంతలు.. ఈ రోడ్డుపై ప్రయాణం సాగించేదెలా..

by Nagam Mallesh |
అడుగడుగునా గుంతలు.. ఈ రోడ్డుపై ప్రయాణం సాగించేదెలా..
X

దిశా, ఆలూర్ : నిజామాబాదు జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న రహదారులు గుంతల మయంగా మారాయి. ఆర్మూర్‌, ఆలూర్‌ మండలాల మధ్య బైపాస్‌ రోడ్డు సమీపంలో రోడ్డు బురదమయింది. వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఆర్మూర్‌ నుంచి ఆలూర్, వెల్మల్‌, కల్లెడితో పాటు నందిపేట మండలానికి వెళ్లే ప్రధాన రహదారి మొత్తం పాడపోయింది. ఎటు చూసినా అడుగడుగునా గుంతలే కనిపిస్తున్నాయి. వర్షాకాలం అయితే గుంతల్లో నీళ్లు నిండి ఎక్కడ ఏ గుంత ఉందో తెలియట్లేదు. ఈ రోడ్డు నిత్యం ప్రయాణికులతో వాహనాలతో రద్దీగా ఉంటుంది. అంతే గాకుండా ఆర్మూర్‌కు చెందిన రైతులకు

సంబంధించి వ్యవసాయ భూములు సుబాష్‌నగర్‌, ఇస్సాపల్లి శివారులో ఎక్కువ ఉండడంతో రైతులు నిత్యం ఇదే రోడ్డు గుండా వెళ్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్ద గుంతలు ఏర్పడి బురదగా మారడంతో ఎప్పుడు ఏ వాహనం జారిపడుతుందో తెలియని పరిస్థితుల్లో వాహనదారులు ఉన్నారు. వాహనాలు వెళ్లే సమయంలో స్కిడ్‌ అయితే పక్కనే గల పొలాల్లో పడి గాయాల పాలు కావడం ఖాయం.

ఏడాదిగా తప్పని తిప్పలు...

ఆలూర్ బైపాస్‌ రోడ్డు సమీపంలో సంవత్సరం క్రితం నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి గగ్గుపల్లి, ఇస్ఫాపల్లి, ఆలూర్‌ గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పట్లేదు. ఏడాది పొడవునా సాగిన బ్రిడ్జి నిర్మాణం ఇప్పుడిప్పుడే పూర్తి కావస్తోంది. బ్రిడ్జిపై స్లాబ్‌ వేసి మట్టి వేసినప్పటికీ ఇటీవల కురిసిన వర్తాలకు ట్రిడ్జికి ఇరువైపులా రోడ్డుకు గుంతలు పడ్డాయి. బ్రిడ్జికి స్లాబ్‌ వేసిన అనంతరం ఇరువైపులా కంకర రోడ్డు వేసి తారురోడ్డు వేయాల్సి ఉంది. సుమారు ఆరకిలోమీటర్‌ వరకు తారురోడ్డు వేస్తే ఈ పరిస్థితులు వచ్చేవి కావు. ప్రజలకు ప్రయాణంలో సౌకర్యంగా ఉండేది. ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయించి బ్రిడ్జికి ఇరువైపులా తారురోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.

రోడ్డును బాగు చేయించాలి..... నారాయణ ఆలూర్ ఆటో డ్రైవర్

ఆలూరు నుండి నిత్యం ప్రజల్ని ఆర్మూర్ పట్టణానికి చేరవేస్తాం. బురద, గుంతల రోడ్ లో ఆటో నడపడం కష్టంగా ఉంది. ప్రయాణికులతో వెళ్లే సమయంలో భయంతో వెళ్లాల్సి వస్తుంది. అధికారులు గమనించి రోడ్డు బాగు చేయించాలి.

Advertisement

Next Story

Most Viewed