- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయాల్లో కొత్త ట్రెండ్..
దిశ, నందిపేట్ : వచ్చేసాధారణ ఎన్నికలు 2024 కొరకు ఇప్పటినుండే పలురాజకీయ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. సోషల్ మీడియానే యువత ఆర్గనైజింగ్ లో కీలకం కానున్నారు. సోషల్ మీడియా, మీడియా పై రాజకీయ పార్టీలు దృష్టి పెడుతున్నాయి. ఎన్నికల కసరత్తు అన్ని పార్టీలు మొదలు పెట్టాయి. నాయకులను, కార్యకర్తలను పార్టీల్లో చేర్చుకోవడం వంటి నుంచే మొదలయ్యాయి. రాజకీయ వ్యూహాలు రచించేందుకు కొందరు వ్యక్తులను ప్యాకేజి రూపంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే నందిపేట్ మండలానికి చెందిన ఓ యువకుని పేరు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గత ఎన్నికల్లో ఓ ముఖ్య నాయకుని దగ్గర, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలో ఓ మహిళ కార్పొరేటర్ విజయంలో ఈ వ్యూహకర్త కీలకంగా పనిచేసిన విషయాన్ని పసిగట్టి అతన్ని తమవైపు తీసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టాయి. మీడియాలో అనుభవంతో పాటు సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొనే టీంతో కార్యకలాపాలు నిర్వహించడంలో ఈ యువ వ్యూహకార్యకర్త దిట్ట. ఇటీవల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి యాత్ర పర్యవేక్షణ చేసిన కాంగ్రెస్ కి చెందిన ముఖ్యనాయకులు సైతం యువకునితో చర్చించినట్లు సమాచారం. ఆర్మూర్ నియోజకవర్గం రాజకీయాల్లోకి ప్రవేశం చేయబోతున్న అంకాపుర్ గ్రామానికి చెందిన నాయకుడు సైతం కలిసినట్లు వినికిడి. మరి ఆ వ్యూహకర్త ఎవరో ఎవరి వైపు మొగ్గుచూపుతారో వేచిచూడాల్సిందే.