పోలీస్ అధికారి భూమి స్వాహా

by Sridhar Babu |
పోలీస్ అధికారి భూమి స్వాహా
X

దిశ, భీంగల్ : జిల్లాలో మైనింగ్ మాఫియా ఆగడాలు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. ఏకంగా పోలీస్ అధికారి భూమినే ఆక్రమించి మైనింగ్ చేసిన సంఘటన వెలుగు చూసింది. గత 20 ఏళ్లుగా అక్రమార్కులు బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లోని దేవన్ పల్లి, మెండోర, కొనసముందర్, మోర్తాడ్, బషీరాబాద్ గ్రామాల్లో తిష్ట వేశారు. అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారుల సహాయ, సహకారాలతో క్వారీలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో నామమాత్రపు పర్మిషన్ తీసుకొని

ఇష్టారాజ్యాంగం విలువైన స్టోన్ ను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో దొరికే రాయి దేశంలోనే అత్యంత క్వాలిటీ కావడం వారి పాలిట వరంగా మారింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా క్వాలిటీ స్టోన్ ఇక్కడ లభించడం తో ప్రభుత్వ భూములనే కాకుండా పక్కన ఉన్న పట్టా భూముల్లోనూ అక్రమంగా మైనింగ్ చేస్తూ అక్రమార్కులు కాసుల పంట పండించుకుంటున్నారు. అనుమతినిచ్చిన ప్రభుత్వ భూముల పక్కన ఉన్న పట్టాభూముల రైతులు స్థానికంగా ఉంటే వారి భూములను కొనుగోలు చేసి మైనింగ్ చేస్తుండగా , స్థానికంగా లేని పట్టాదారు రైతుల భూములను ఆక్రమించుకొని ఇష్టారాజ్యంగా తవ్వకాలు, పేలుళ్లు నిర్వహిస్తున్నారు.

పోలీస్ అధికారి భూమినే ఆక్రమించిన అక్రమార్కులు...

అడ్డూ అదుపూ లేకుండా భీంగల్ ప్రాంతంలో క్వారీలు నిర్వహిస్తున్న మైనింగ్ మాఫియా ఆగడలకు అంతేలేకుండా పోతోంది. గవర్నమెంట్ భూమిని ఆనుకొని ఉన్న ఓ పోలీస్ అధికారికి చెందిన భూమినే కబ్జా చేసి మైనింగ్ కు పాల్పడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ అధికారి సీపీని కలిసి వివరించారు.

టాస్క్ ఫోర్స్ టీం దాడి...?

భీంగల్ మండలం దేవన్ పల్లి, మెండోరా క్వారీలపై టాస్క్ ఫోర్స్ టీం రైడ్ చేసి అనుమతికి మించి జీలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకోవడం తో పాటు భూ ఆక్రమణను గుర్తించి ముగ్గురు నిర్వాహకులను ఆడుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది. ఈ విషయం స్థానిక రెవెన్యూ, మండల పరిషత్, పోలీస్ అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం.

Advertisement

Next Story