బాన్సువాడను జిల్లా చేస్తానని మాట ఇచ్చి తప్పిన పోచారం : టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి

by Sumithra |
బాన్సువాడను జిల్లా చేస్తానని మాట ఇచ్చి తప్పిన పోచారం : టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడను జిల్లా చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట తప్పారని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి విమర్శించారు. కామారెడ్డి జిల్లా నసుర్లాబాద్ మండలం దుర్కి వద్ద హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై చార్జ్ షీట్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పోచారం కుమారులు కాంక్రీట్ తవ్వకాలు, అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్నారు. 2018 ఎన్నికల్లో బాన్సువాడను జిల్లా కేంద్రంగా చేస్తామని మాట తప్పారన్నారు.

బాన్సువాడ, పాత నిజామాబాద్ కు నీళ్లు ఇవ్వాలన్న ప్రజల డిమాండ్ ను పట్టించుకోలేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లల్లో అవకతవకల పై నిలదీసినవారిని అక్రమంగా పోలీసులతో అరెస్ట్ చేయించారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఎమ్మెల్యే సోదరుడు, కుమారుల అనుమతి లేనిదే ఏదీ జరగని పరిస్థితి అని విమర్శలు గుప్పించారు. గతంలో వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు యంత్ర లక్ష్మీ పథకంలో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, రాజయ్య, కైలాష్ శ్రీనివాస్, కాసుల బాలరాజ్, గడుగు గంగాధర్, స్థానిక నాయకులు నందు పటేల్, అరిగే సాయిలు, బోయిని శంకర్, సాయాగౌడ్, ఖాలేఖ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story