వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలు

by Sridhar Babu |
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలు
X

దిశ, భిక్కనూరు : వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం పక్కాగా అమలు చేసి తీరుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. శనివారం భిక్కనూరు మండలం లక్ష్మీ దేవుని పల్లి గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ ఏను పరమేశ్వర్ రెడ్డి తోపాటు మరో 11 మంది బీఆర్ఎస్ పార్టీని వీడి షబ్బీర్ అలీ సమక్షంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వీరందరికీ కండువాలు మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలు దిశగా ప్రభుత్వం పని చేస్తుంటే, ఇది గిట్టని ప్రతిపక్ష నాయకులు లేనిపోని విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పనితీరును చూసే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి,

డీసీసీ ఉపాధ్యక్షులు మధ్య చంద్రకాంత్ రెడ్డి, ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపరి భీంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, ఎన్ఆర్ఐ సెల్ జిల్లా కన్వీనర్ చిట్టెడి సుధాకర్ రెడ్డి, ఏనుగు లింగారెడ్డి, గడ్డం ఇంద్రారెడ్డి, ఏనుగు ఎల్లారెడ్డి, ఆత్మకూరు లింబా రెడ్డి, ఏనుగు మాధవరెడ్డి, కొమ్ముల లక్ష్మారెడ్డి, ఒల్లెపు చింటూ, మాగిని ఎల్లయ్య, పుల్లూరు శంకరయ్య, మాగిని ఎల్లయ్య, అలకుంట నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story