రోడ్ల పక్కన వ్యర్థ పదార్థాలు పడేస్తే జరిమానా

by Sridhar Babu |
రోడ్ల పక్కన వ్యర్థ పదార్థాలు పడేస్తే జరిమానా
X

దిశ, కామారెడ్డి : జాతీయ రహదారి పక్కన చెత్త కుప్పలు పోసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మున్సిపల్ కమిషనర్ సుజాతను ఆదేశించారు. కామారెడ్డి మండలం రామేశ్వర్ పల్లి శివారులో డంపింగ్ యార్డ్ ను మంగళవారం ఆయన సందర్శించారు. పట్టణంలోని చెత్తాచెదారాన్ని ఇక్కడికి తీసుకువచ్చి వేస్తారని మున్సిపల్ కమిషనర్ సుజాత కలెక్టర్ కు తెలిపారు. 16 ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డ్ ఉందని చెప్పారు.

ఇక్కడ వేసిన చెత్తతో కంపోస్టు ఎరువులు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఫంక్షన్ హాల్స్ కు సంబంధించిన వ్యక్తులు వ్యర్థ పదార్థాలను పడేయడం వల్ల దుర్వాసన వస్తుందని స్థానికులు తెలిపారు. వ్యర్థ పదార్థాలు జాతీయ రహదారి పక్కన పడేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులకు సూచించారు.

సీఎంఆర్ డెలివరీ వేగవంతం చేయాలి

సీఎంఆర్ డెలివరీ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సీఎంఆర్ డెలివరీ పై సివిల్ సప్లై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు రైస్ మిల్లును నిరంతరం పర్యవేక్షణ చేస్తూ డెలివరీ వేగవంతమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. లక్ష్యానికి అనుగుణంగా డెలివరీ కాకపోతే రైస్ మిల్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమీక్ష సమావేశంలో ఇంచార్జ్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నిత్యానందం, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు కిష్టయ్య, శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed