Firecracker shops : జాతీయ రహదారిపై విచ్చలవిడిగా టపాకాయల దుకాణాలు

by Naveena |
Firecracker shops : జాతీయ రహదారిపై విచ్చలవిడిగా టపాకాయల దుకాణాలు
X

దిశ ఆర్మూర్ : దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరూ కాల్చే టపాకాయలను జనాల రద్దీ లేని ఏరియాలో, ప్రమాదాలు జరిగిన ప్రజలకు ఇబ్బంది కలగని మైదాన ప్రాంతాల్లో టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు అనుమతులు ఇస్తారు. కానీ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి, పెర్కిట్ కోటార్ మూర్ ఏరియాల్లో ప్రధాన రహదారుల గుండానే ఇతర దుకాణాల ముందరనే టపాకాయల స్టాళ్లను ఏర్పాటు చేసి.. సదరు నిర్వాహకులు టపాకాయలను అమ్మకాలు చేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ వీలిన గ్రామాల్లో ప్రధాన చౌరస్తాల్లో టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేసి క్రాకర్స్ లను అమ్ముతున్నారు. ఈ దుకాణాల ముందు కొనుగోలుదారులు వాహనాలను నిలిపివేస్తున్నారు. ప్రధాన రోడ్లపై వాహనాల నిలుపుదల తో.. రోడ్లన్నీ వాహనాలతో చిందరవందరగా ట్రాఫిక్ తలపిస్తున్నాయి. ఈ టపాకాయల దుకాణాల సైడ్ ఆర్మూర్ పోలీస్ అధికారులు కనీసం కన్నెత్తి చూడడం లేదు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా టపాకాయల దుకాణాలను నిర్వహిస్తున్న ఆ దుకాణాల వద్ద ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారో.. మితిమీరిన వాహనాల రద్దీతో రోడ్డు ప్రమాదాలు ఏమైనా సంభవిస్తే ఎవరు బాధ్యత వహించనున్నారో తెలియడం లేదు. ప్రజల రక్షణ.. చూసేవారు..ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులే ఇలా చూసి చూడనట్టుగా ఉండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story