- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో చూచిరాతలు
జవాబు చీటీలను అభ్యర్థులకు అందిస్తున్న ఇన్విజిలేటర్లు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలల్లో జరుగుతున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షల్లో చూచిరాతల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన డిగ్రీ పరీక్షల సందర్భంగా ఒక ఇన్విజిలేటర్ పరీక్ష పత్రాలను నేరుగా బాత్రూంకు తీసుకెళ్లి అక్కడ నుంచి జవాబు పత్రాలను తీసుకొచ్చి అభ్యర్థులకు ఇచ్చి రాయిస్తున్న వ్యవహరం వెలుగులోకి వచ్చింది. కొందరు సంబంధిత వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది.
అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేసి ఈ తతంగాన్ని నడుపుతున్నారని పరీక్ష రాస్తున్న అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇన్విజిలేటర్లు డబ్బు తీసుకుని అభ్యర్థులకు జవాబు పత్రాలను ఇస్తున్నారని ఆ వీడియోను సాక్ష్యంగా చెబుతున్నారు. సంబంధిత వీడియో గురించి పరీక్షల నిర్వాహకులను ప్రశ్నించేందుకు యత్నిస్తే ఫోన్ లాక్కునేందుకు యత్నించారని వీడియో తీసిన వ్యక్తి ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారులు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. గతేడాది కూడా పరీక్షల్లో వసూళ్ల కార్యక్రమం జరిగిందని ఆరోపణలున్నాయి.