జిల్లాలో చిచ్చు పెట్టాలని చూస్తే ఖబర్దార్ అజారుద్దీన్..

by Sumithra |
జిల్లాలో చిచ్చు పెట్టాలని చూస్తే ఖబర్దార్ అజారుద్దీన్..
X

దిశ, గాంధారి : జిల్లాలో చిచ్చు పెట్టాలని చూస్తే ఖబర్దార్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్లను బ్లాక్ లో అమ్ముకున్న దొంగవు నువ్వు... భారత్ జొడో యాత్రలో, మునుగోడు ఎన్నికల సమయంలో ఇక్కడ కనిపించని నువ్వు ఇప్పుడు ఇక్కడకు వచ్చి సవాల్ చేయడమా.. ఆచితూచి మాట్లాడు ఖబడ్దార్ అజారుద్దీన్ అని మండల కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లాలో అవకాశం వస్తే కామారెడ్డి జిల్లా నుండి పోటీ చేస్తా అని అనడం పై గాంధారి మండల కాంగ్రెస్ నాయకులు అజారుద్దీన్ పై నిప్పులు చెరిగారు.

శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టాలని చూస్తే ఖబర్దార్, తగిన బుద్ధి చెప్తామని అన్నారు. అంతేకాకుండా ఈ పార్లమెంట్ పరిధికి అసలు సంబంధం లేని వ్యక్తిని తీసుకువచ్చి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టాలని చూస్తున్న అజారుద్దీన్ ను ఇంచార్జిగా తీసేసి అంజన్ కుమార్ యాదవ్ కు ఇచ్చారని తెలిపారు. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జూడో యాత్ర ఒక్కరోజు కూడా ఇక్కడ కనపడిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాంధారి ఎంపీటీసీ బాల్ రాజ్, శ్రీనివాస్, సీనియర్ నాయకులు లైన్ రమేష్, మదర్, జనార్దన్ రెడ్డి, ఆఫీస్, మోహన్, గణేష్ నాయక్, సంఘం రాజు, జశ్వంత్ గౌడ్, నిజాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story