అధికారికంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించాలి

by Sridhar Babu |
అధికారికంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించాలి
X

దిశ, కామారెడ్డి : బతుకమ్మ వేడుకలను మండల, జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో బతుకమ్మ వేడుకల నిర్వహణపై పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహించాలన్నారు. వేడుకల్లో మండల, జిల్లా కేంద్రాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా చూడాలని కోరారు. మహిళా సంఘాల సభ్యులను బతుకమ్మ వేడుకల్లో భాగస్వాములను చేయాలన్నారు.

సద్దుల బతుకమ్మ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. చెరువులు, కుంటలు తదితర నీటి ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను నియమించాలన్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో శానిటేషన్ పనులు, విద్యుత్ లైట్లు, షామియానాలు కల్పించాలన్నారు. తెలంగాణ సాంస్కృతిక కళాకారులను బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, డీఎస్పీ నాగేశ్వర్ రావు, జిల్లా సంక్షేమ అధికారి బావన్న, జిల్లా ప్రణాళిక అధికారి రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story