- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SRSP officials : బీఆర్ఎస్ కనుసన్నలో ఎస్సారెస్పీ అధికారులు..
దిశ, బాల్కొండ : వానకాల పంటల కోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి బుధవారం ఉదయం నీటి విడుదల చేపట్టుతుండడంతో ఎస్సారెస్పీ అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడం పట్ల అధికార దుర్వినియోగం చేస్తున్నారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సుంకేట్ అన్వేష్ రెడ్డి ఆరోపించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అతిథి భవనంలో ఉదయం విలేకరుల సమావేశంలో అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామ్ సార్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులు వేసుకుంటున్న పంటలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులో 50 టీఎంసీలు తక్కువగా 45 టీఎంసీలే నీరున్నా ఉన్న నీటిని విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసి ఏడో తేదీని ఖరారు చేసింది. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి కాకతీయ లక్ష్మీ సరస్వతి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు ఎస్ఆర్ఎస్పీ అధికారులు రంగం సిద్ధం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి సమాచారం అందించి కాంగ్రెస్ నాయకులకు సమాచారం అందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, రైతు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా మేము, మైనింగ్ శాఖ చైర్మన్ గా ఈరవత్రి అనిల్ కు నీటి విడుదల సమాచారం అందించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ అధికారుల తీరును వెంటనే ఉన్నతాధికారులను సీఈ, ఈఎన్సీ అధికారులకు తెలుపుతామన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ ద్వారా 15 రోజులు నీటిని ఎత్తిపోసి కేవలం 2.4 టీఎంసీల నీటిని రిజర్వాయర్లో నింపారన్నారు. రెండు నెలలపాటు రైతులు వానాకాలం పంటలు వేసుకొని వర్షాల కోసం ఎదురుచూసిన నీటిని విడుదల చేయలేరన్నారు. బుధవారం కాకతీయ కాలువ లక్ష్మీ సరస్వతి ద్వారా విడుదల చేసిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సాగర్, రొట్టె సంతోష్ కుమార్, మల్లారెడ్డి, రవి సాగర్, కిషన్, మైలారం శ్రీను తదితరులున్నారు.