- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
collector : ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..
దిశ, నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో హాజరు పట్టికను పరిశీలించి ఈ నెల 27వ తేది నుంచి నేటి రోజు వరకు విధులకు హాజరు కానీ జూనియర్ అసిస్టెంట్ సుభాష్ ను సస్పెన్షన్ కు ఆదేశించారు. అదేవిధంగా రెగ్యులర్ గా విధులకు హాజరు కానీ ల్యాబ్ టెక్నీషియన్ నవ్యశ్రీ ని మెమో జారీ చేసి సంజాయిషీ కోరాలని జిల్లా ఇంచార్జి వైద్యాధికారి చంద్ర శేఖర్ ను ఆదేశించారు. అనంతరం ఆస్పత్రిలోని ఇన్ పేషెంట్ వార్డును పరిశీలించి రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న రోగుల సేవల పై సంతృప్తి వ్యక్తం చేశారు.
అందుబాటులో ఉన్న మందుల వివరాలను వైద్యాధికారి రోహిత్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రి ఆవరణలో నాటిన హరితహారం చెట్లను పరిశీలించారు. మెడికల్ వ్యర్ద్యాలను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా గుంతలలో వేయాలని ఆదేశించారు. ఆయనతో బాన్సువాడ ఆర్డీఓ రమేష్ రాథోడ్, జిల్లా ఇంచార్జి వైద్యాధికారి చంద్ర శేఖర్, ఉపవైద్యాధికారి విద్య, జిల్లా డీఆర్డీఏ పీడీ చందర్ నాయక్ మండల తహశీల్దార్ బిక్షపతి, మండల అభివృద్ధి అధికారి గంగాధర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చందూరి అంజయ్య ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.