'దేశానికి అన్నపూర్ణ తెలంగాణ.. బంగారు తెలంగాణ దిశగా అడుగులు'

by Vinod kumar |
దేశానికి అన్నపూర్ణ తెలంగాణ.. బంగారు తెలంగాణ దిశగా అడుగులు
X

దిశ, నిజామాబాద్ సిటీ: బీఆర్ఎస్ అంటే భారత రెస్క్యూ సమితి అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో మంగళవారం శ్రీరామ గార్డెన్‌లో నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధుల సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ తల్లి చిత్ర పటాలకు పులా మాలవేసి అమరవీరుల కు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఎస్ఎఫ్ లాగే బీఆర్ఎస్ కూడా దేశ వ్యాప్తంగా సేవ అందించనున్నదని అన్నారు. శాంతి యుతంగా, గాంధేయ మార్గంలో తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు.

దేశంలో ఎవ్వరిని అడిగిన కేసీఆర్ సంక్షేమ పథకాలు చెబుతారని పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మీ, షాది ముభారఖ్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్, వితంతు పెన్షన్ ఇస్తూ ఇంటికే పెద్ద కొడుకు అయ్యాడని అన్నారు. దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీల లిస్ట్ తీయగా అందులో తెలంగాణలోని గ్రామాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అందులో మన నిజామాబాద్ నుంచి 3 గ్రామాలు ఉన్నాయంటే ఎంత అభివృద్ధి సాదించామో ఇంకా చెప్పనక్కర లేదన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, అర్బన్ అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ మేయర్ ఆకుల సుజాత, కార్యదర్శి ఎనగందుల మురళి, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed