- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ దొంగ పై అన్ని కేసులా..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ మూడవ టౌన్ పోలిసులు ఘరానా దొంగను పట్టుకున్నారు. అతని స్నేహితుడితో కలిసి కారులో వచ్చి ఇంటిని దోచేసిన కేసును చాక చక్యంగా ఛేదించారు. నిజామాబాద్ ఎసీపీ వేంకటేశ్వర్ గురువారం తన కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. అగస్టు 17 గౌతంనగర్ కు చెందిన బేగరి రాజు తన ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్ళగా, 19న తిరిగి ఇంటికి వచ్చాడు. తాను వచ్చేసరికి గుర్తుతెలియని దొంగలు తన ఇంటి తాళం పగులగొట్టి తలుపులు తెరిచి వుంచారు. లోపలికి వెళ్లి చూసేసరికి ఇంట్లో ఉన్న బీరువాను పగులగొట్టి అందులో ఉన్న బంగారు, వెండి నగలు ఎత్తుకెళ్లారని మూడవ టౌన్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కేస్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గురువారం కందికంటి రాజు గౌడ్ అలియాస్ బిల్లీ రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో బిల్లీ రాజు తనతో పాటు సంభావారి కిరణ్ అనే వ్యక్తి ఇద్దరు కలిసి చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అనంతరం రాజు దొంగలించిన బంగారు ఆభరణాలు, వెండి, ఇతర సామగ్రి, రూ. 500 నగదు స్వాధీనం చేసుకున్నారు. చోరికి ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ఆదర్శ్ నగర్ కు చెందిన కందికంటి రాజుపై గతంలో నిజామాబాద్ మూడవ టౌన్, కామారెడ్డి, బోధన్ పోలిస్ స్టేషన్ లలో మర్డర్ ఫర్ గైస్, అటెంప్ట్ మర్డర్ , 18 దొంగతనాల కేసులు ఉన్నాయన్నారు. రాజు అలియాస్ బిల్లి రాజు పై మూడవ టౌన్ పోలిస్ స్టేషన్ లో సస్ఫెక్ట్ షీట్ ఉందన్నారు. ఈ కేసుని చేదించటంలో ముఖ్య పాత్ర వహించిన నిజామాబాద్ టౌన్ -3 ఎస్సై జీ.నరేశ్, టౌస్ -3 పీఎస్ సిబ్బంది అఫ్సర్, వెంకట్ రామ్, జగన్ లను నిజామాబాద్ ఎసీపీ వెంకటేశ్వర్, నిజామాబాద్ టౌన్ ఇంచార్జ్ సీఐ శ్రీశైలంలు అభినందించారు.