- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ దొంగోడిలో మార్పు రాదా..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎన్ని కేసులు ఉన్నా, ఎన్ని సార్లు జైలుకు వెళ్లి వచ్చినా ఆ దొంగ ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికే 32 కేసులు తనపై ఉన్నా, పీడీ యాక్టుపై జైలుకు వెళ్లి వచ్చినా దొంగతనాలు మానుకోలేదు. అలాంటి గజ దొంగను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నట్లు పోలీసు కమిషనర్ కె.ఆర్.నాగరాజు తెలిపారు. మంగళవారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో పాత నేరస్తుడు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రానికి చెందిన ఆకులవార్ రాజేంధర్ ను అరెస్టు చేసినట్లు సీపీ నాగరాజు తెలిపారు.
మంగళవారం బోధన్ బస్టాండ్ ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నంబర్ ప్లేట్ లేని వాహనంలో వస్తున్న ఆకులవార్ రాజేంధర్ ను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఈ విచారణతో నగరంలో ఏడు బైక్ దొంగతనాల కేసులు కొలిక్కి వచ్చాయని తెలిపారు. నిజామాబాద్ నగరంలో 5, మహారాష్ట్రలో 2 బైక్ దొంగతనాలు చేసి వాటిని తీసుకువచ్చి నిజామాబాద్ నగరంలో బాబాన్ సాహెబ్ పహాడ్ ప్రాంతంలోని అత్తగారి ఇంటి వద్ద ఉంచి తక్కువ ధరకు విక్రయించేవాడని సీపీ తెలిపారు.
ఆకులవార్ రాజేంధర్ పై హైదరాబాద్, నిజామాబాద్, కాచిగూడ, అఫ్జల్ గంజ్, ఎస్ఆర్ నగర్, కుకట్ పల్లి, మహంకాళి, మారేడుపల్లి, ప్రాంతాలలో 32 ఇండ్లలో, బైక్ దొంగతనాల కేసులు ఉన్నాయని తెలిపారు. అఫ్జల్ గంజ్ పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపినా అతనిలో మార్పు రాలేదని సీపీ తెలిపారు. ఈ కేసు ఛేదించడంలో సీసీఎస్ సీఐ రాజశేఖర్, 1వ టౌన్ ఎస్ హెచ్ వో విజయ్ బాబు, ఎస్సై శ్రావణ్ కుమార్, ఏఎస్సైలు షకిల్, దత్తాద్రి,కానిస్టేబుల్ ప్రసాద్, రమణ, ఖాలిద్ లను సీపీ అభినందించారు.