Dharmapuri Arvind : బీజేపీతోనే దేశం అభివృద్ధి

by Sridhar Babu |   ( Updated:2023-08-26 13:11:53.0  )
Dharmapuri Arvind : బీజేపీతోనే దేశం అభివృద్ధి
X

దిశ,భీమ్‌గల్ : బీజేపీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా బైక్ ర్యాలీలో కర్ణాటక ఎమ్మెల్యే శశికళ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి మల్లికార్జున్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం చేయని అవినీతి లేదని అన్నారు. ఈ అవినీతిలో మంత్రి ప్రశాంత్ రెడ్డికి కూడా వాటా ఉందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో వరి కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇందులో వచ్చిన డబ్బులతో సీఎం కేసీఆర్ ఒక్కో ఎమ్మెల్యేకి 40 కోట్లు

ఇచ్చి100 సీట్లు గెలవాలని చూస్తున్నారని అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎక్కడ ఉందని అన్నారు. నేడు రాష్ట్రంలో బీఆర్ఎస్ కి ఓటు వేసే వారే లేరన్నారు. ఆకాశం కింద ఏం చేయగలుగుతామో అది చేసి ప్రశాంత్ రెడ్డిని ఓడగొడతామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి 70 సీట్లు రావడం ఖాయం అని అన్నారు. ఒకవేళ తక్కువ వచ్చినా తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే మోదీ పాలన తెస్తామని, రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం కన్వీనర్ మాల్కానగారి మోహన్, మండల అధ్యక్షుడు మహిపాల్, పట్టణ అధ్యక్షుడు యోగేశ్వర నర్సయ్య, బాల్కొండ నియోజకవర్గం బీజేవైఎం అధ్యక్షుడు కనికరం మధు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story