- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేబిస్ వ్యాధి పై అవగాహన కలిగి ఉండాలి.. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..
దిశ, కామారెడ్డి : రేబిస్ వ్యాధి పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ రేబిస్ వ్యాధి దినోత్సవం సందర్భంగా పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేబిస్ ప్రాణాంతక వ్యాధి అని అన్నారు. కుక్క కాటుకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
కుక్క కరచిన వెంటనే శుభ్రమైన నీటితో కడగాలని, వెంటనే వైద్యుడిని సంప్రదించాలన్నారు. పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలని తెలిపారు. ఈ విషయమై పాఠశాలల విద్యార్థులకు, యువతకు, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పశు సంవర్థక అధికారి రాజేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, సీపీఓ రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.