ప్రజా పాలన డబ్బుల పంపిణీలో ఎంపీడీవో చేతివాటం

by Naresh |
ప్రజా పాలన డబ్బుల పంపిణీలో ఎంపీడీవో చేతివాటం
X

దిశ, లింగంపేట: ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి ఎంపీడీవో మల్లికార్జున్ రెడ్డి చేతివాటం ప్రదర్శించినట్లు ఎంపీపీ గరీబున్నిస నయీం తెలిపారు. ఈ విషయమై కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. గత నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణ కోసం ప్రతి పంచాయతీకి పదివేల రూపాయల చొప్పున 41 జీపీలకు నాలుగు లక్షల పదివేల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. కానీ ఎంపీడీవో చేతివాటం ప్రదర్శించి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఒక్కో జీపీకి పదివేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా రూ. 7000 నుంచి రూ. 9000 రూపాయల వరకు ప్రజా పాలన నిర్వహణ డబ్బులు అందించినట్లు ఆమె తెలిపారు. మండలంలోని అయ్య పల్లి తండా బాణాపూర్ తండా పంచాయతీలకు ఏడు వేల రూపాయలు ఎల్లారం మాలపాటి జగదాంబ తండా ఎల్లమ్మ తండా ఒంటరి పల్లి సజ్జన్ పల్లి కొయ్య గుండు తండాలకు రూ. 8000 కొండాపూర్ ముంబాజి పేట్ పంచాయతీలకు రూ. 9000 చొప్పున పంపిణీ చేసినట్లు ఎంపీపీ తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో అవినీతి అక్రమాలకు పాల్పడకుండా కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన స్థానికంగా ఎంపీడీఓ మాత్రం చేతి వాటం ప్రదర్శించినట్లు ఎంపీపీ వెల్లడించారు. ఎంపీడీఓ అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎంపీపీ కలెక్టర్‌ను కోరారు.

Advertisement

Next Story