రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం.. పనుల ఆలస్యానికి రాష్ర్ట ప్రభుత్వమే కారణం..

by Sumithra |
రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం.. పనుల ఆలస్యానికి రాష్ర్ట ప్రభుత్వమే కారణం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో అలస్యం కావడంతోనే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల నత్తనడకన నడుస్తున్నాయని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపూరి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవనగర్ లో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులతో కలిసి పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పనుల పై అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులు 90% పూర్తయ్యాయని త్వరలోనే నిర్మాణ పనులు పూర్తిచేసుకుని సంక్రాంతి పండగకు ప్రారంభానికి సిద్ధమవుతుందన్నారు. మాక్లూర్ మండలం అడివి మామిడిపల్లి ఆర్ఓబీ నిధులను రాష్ర్త ప్రభుత్వం దారిమళ్లించిందన్నారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్ని మండిపడ్డారు. ఆర్ఓబీ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్ కు ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story