సైబర్ కేటుగాళ్ల మోసానికి అమాయక వ్యక్తికి కుచ్చుటోపి...!

by Aamani |
సైబర్ కేటుగాళ్ల  మోసానికి అమాయక వ్యక్తికి కుచ్చుటోపి...!
X

దిశ,టేకులపల్లి : సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. జనాలను మోసం చేసేందుకు కొత్త పంథాను ఎంచుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారని, మోసం చేసేందుకు కొత్త విధానాలు అనుసరిస్తున్నారు. గురువారం మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో నివసిస్తున్న వాంకుడోత్ సురేష్ కి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీరు వ్యాపారం చేసుకోవడానికి పరుపులు అతి తక్కువ ధరలో వస్తాయని నమ్మబలికిచ్చి ముందుగా రూ.71,000 ఫోన్ పే కొట్టించుకున్నాడు. తర్వాత అనుమానం వచ్చి టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో తెలుపగా పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ నేరగాళ్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫోన్ చేయగా రూ.23 వేలను పోలీస్ డిపార్ట్మెంట్ సీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ పరుపులు కొనడం గాని, ఆన్లైన్ లో ఏమైనా వస్తువులు గాని లోన్లు గాని ఫోన్ లో వచ్చిన ఏ విషయానికైనా స్పందించొద్దని టేకులపల్లి ఎస్సై పి. సురేష్ తెలిపారు.

Next Story