- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్రమ సంబంధంతో..కూతురిని కడతేర్చిన కన్నతల్లి..చివరికి ఏం జరిగిందో చూడండి..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 06: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని పేగు బంధాన్ని మరిచి కన్న కూతురును చంపిన కసాయి తల్లికి ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ జీవితఖైదు విధిస్తూ బుధవారం తీర్పును వెలువరించారు. ఆమెతో పాటు మరో వ్యక్తికి కూడా జీవితఖైదును విధించారు. వివరాల్లోకి వెళితే..బోధన్ మండలం కల్దుర్కికి చెందిన సంజీవ్ అనే వ్యక్తి గ్రామంలో జులాయిగా తిరిగేవాడు. అనంతరం కూలీ పనులు చేసేందుకు మోర్తాడ్ కు వెళ్లాడు. అక్కడ చెంచుల రజిత అలియాస్ రాధ అనే మహిళతో సంజీవ్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వారి మధ్య అక్రమసంబంధానికి దారి తీసి.. ఇద్దరూ సహజీవనంలో ఉన్నారు. రజితకు అప్పటికే మూడేళ్ల కూతురు ఉంది. వీరి అక్రమ సంబంధానికి పాప అడ్డుగా ఉందని భావించి.. గతేడాది ఏప్రిల్ 10, 2023 రోజున రాత్రి పాపను తీవ్రంగా కొట్టారు. అఅక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని పేగు బంధాన్ని మరిచి కన్న కూతురును చంపిన కసాయి తల్లికి ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ జీవితఖైదు విధిస్తూ బుధవారం తీర్పును వెలువరించారునంతరం పాపను చెరువులో తలకిందులుగా నీళ్లలో ముంచి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం పాప మృత దేహాన్ని చెట్లపొదల్లో పడేసి తెల్లవారు జామున ఇంట్లో వస్తువులను సర్దేసుకుని పారిపోయేందుకు ప్రయత్నించడాన్ని గమనించిన వారి బంధువు రజితను ప్రశ్నించాడు. ఆమె మాటలు అనుమానాస్పదంగా అనిపించడంతో నిలదీసాడు. దీంతో అసలు విషయం చెప్పేసింది. పాపను చంపేసిన విషయం బయటపెట్టింది. ఈ విషయంపై ఆయన బోధన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పాప హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడంతో.. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి ఇద్దరు నిందితులు రజిత, సంజీవ్ లకు జీవిత ఖైదుతో పాటు రూ. 3 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.