- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బేవకూఫ్ మాటలు బంద్ చెయ్ కేటీఆర్.. మహమ్మద్ అలీ షబ్బీర్
దిశ, భిక్కనూరు : అమెరికాలో ఉండి ప్రభుత్వం పై విమర్శలు చేయడం కాదు.. దమ్ముంటే ఫీల్డ్ మీదికి రా... బేవకూఫ్ మాటలు బంద్ చెయ్ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. మంగళవారం నాడు ఆయన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి వరద నీరు వచ్చి, నిరాశ్రయులైన బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఎఫ్టీఎల్ పరిధిలో డబుల్ బెడ్ రూంలు నిర్మించడం వల్లే నిరుపేదలకు ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు.
ప్రభుత్వం వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో పర్యటిస్తుండగా, మంత్రులు ఎమ్మెల్యేలు, తమలాంటి నాయకులు తమతమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వరద బాధితులను ఆదుకునేందుకు ఫీల్డ్ విజిట్ చేస్తూ, వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. అమెరికాలో కూర్చొని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేయడం మానుకోవాలని, మీ నాయన కేసీఆర్ లాగా ఫామ్ హౌస్ లో పడుకొని పరిపాలన చేస్తలేమని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే, ఇది గిట్టని కేటీఆర్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం మానుకోవాలని ఘాటుగా హెచ్చరించారు.