దేశం కోసం, ధర్మం కోసం మోడీ కృషి

by Disha Web Desk 15 |
దేశం కోసం, ధర్మం కోసం మోడీ కృషి
X

దిశ, లింగంపేట్ : దేశం కోసం, ధర్మం కోసం మోడీ కృషి చేస్తున్నారని జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలో రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి, లింగం పేట్ మండలాల్లో కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారానికి ఆయా మండలాల్లో పర్యటించిన బీబీ పాటిల్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టి ఘన స్వాగతం పలికారు. రామారెడ్డి, లింగం పేట్ లో మహానీయుల విగ్రహాలకి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. సదాశివ నగర్ లో వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. ఎడ్లబండి పై రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి మోడీ తోనే సాధ్యం అని స్పష్టం చేశారు. ఆప్ కీ బార్ చార్ సౌ పార్ లో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ పదేళ్లలో మోడీ ప్రభుత్వ సహకారంతో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఇంకా పెండింగ్ పనులను పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు, జాతీయ రహదారులు, రైల్వే లైన్, ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి పనులు పూర్తి చేశానని తెలిపారు. దేశాన్ని విశ్వగురువుగా నిలిపిన మోడీ మరోసారి ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పేద వర్గాల ప్రజలకు బీజేపీ చేయూతనిస్తుంది అని చెప్పారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారెంటీ లపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని, మోడీ గ్యారంటీ పై ప్రజల్లో ఆదరణ లభిస్తుంది అని పేర్కొన్నారు. ఇటీవల మన నియోజకవర్గం లో జరిగిన జనసభ లో మోడీ

అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 13 న జరిగే ఎంపీ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించి జహీరాబాద్ సీటును మోడీ కి బహుమతి గా ఇద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, పార్లమెంట్ ప్రభారీ పెద్దోళ్ల గంగారెడ్డి, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.మర్రి రాంరెడ్డి , మండల అధ్యక్షులు మాసుల శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, రాష్ట్ర నాయకులు మర్రి బాపురెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు బొల్లారం సాయిలు రామకృష్ణ వడ్ల భీమయ్య కమ్మరి వెంకటేశం రామచందర్ నవీన్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed