- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం లోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో సిద్ధిలగుట్ట వెనకాల దోబీ ఘాట్, ఆలూరు బైపాస్ రోడ్డులో గల ఓ ప్రైవేట్ వెంచర్లో శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ జరగనుంది. సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ స్థల ఏర్పాట్లను గురువారం రాత్రి నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. బహిరంగ సభకు హాజరుకానున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కవిత సూచించారు. సభకు హాజరయ్యే వాహనాలతో ట్రాఫిక్ జామ్ కాకుండా పార్కింగ్ కోసం పక్కాగా ఏర్పాట్లు చేయించాలని సూచించారు. వారి వెంట ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న, ఎంపీపీలు పస్కా నరసయ్య, వాకిడి సంతోష్ రెడ్డి, మాస్త ప్రభాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు గంగా మోహన్ చక్రు, కాందేష్ సంగీత శ్రీనివాస్, మేడిదాల సంగీత రవి గౌడ్, నాయకులు మోత్కూరి లింగా గౌడ్, గోవింద్ పేట్ ఈ గంగాధర్, పండిత్ ప్రేమ్, అంజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.