కొమురం భీం విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

by Mahesh |
కొమురం భీం విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
X

దిశ, డొంకేశ్వర్: ఈరోజు ఉదయం డొంకేశ్వర మండలం గాదేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా కొమురం భీం విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ.. కొమురం భీం విప్లవ వీరుడు ఓటమి ఎరుగని పోరాటయోధుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1940 సంవత్సరంలో కొమురం భీం జన్మించారు. ఆ సమయంలో గిరిజనులపై అత్యాచారాలు అణచివేతలు చాలా జరిగాయి. వాటికి వ్యతిరేకంగా కొమరం భీమ్ పోరాటాలు చేసి అలుపెరుగని వీరుడిగా గిరిజన హక్కులకై పోరాడిన యోధులు గా గుర్తించారు. అందుకు నిదర్శనంగానే ఆదివాసి ముద్దుబిడ్డ అని పరిగణిస్తారు.ఆయన పోరాటానికి చిహ్నంగానే కోమురం భీం విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుంది. ఆయన గొప్ప యోధుడని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు డొంకేశ్వర మండల అధ్యక్షుడు, కార్యకర్తలు, ఆదివాసీ నాయకులు, సేవా సంఘం సభ్యులు అందరూ పాల్గొన్నారు.

Next Story