- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
లెవీ సేకరణ, ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో మంత్రి సమీక్ష
దిశ ప్రతినిధి,నిజామాబాద్ : లెవీ సేకరణ, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని స్టేట్ ఛాంబర్లో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, రాకేష్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ధాన్యం కొనుగోళ్ల తీరుతెన్నులపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ఎవరూ ఏ విషయంలోనూ ప్రశ్నించే పరిస్థితి తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోళ్లు జరపాలని, రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని మంత్రి హితవు పలికారు.
ముఖ్యంగా రైతులు రైస్ మిల్లుల వద్ద నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల వద్దనే వారికి సమగ్ర వివరాలతో కూడిన రసీదులు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ కూడా పొరపాట్లకు ఆస్కారం కల్పించకూడదని, తప్పిదాలు చోటుచేసుకుంటే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. కాగా, డిఫాల్టర్లుగా లేని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించాలని సూచించారు. ధాన్యం మిల్లింగ్ అయిన వెంటనే బియ్యాన్ని సివిల్ సప్ప్లైస్ గోడౌన్లకు తరలించాలన్నారు. వచ్చే జనవరి మాసం నుండి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నందున ఒక్క బియ్యం గింజ కూడా చెడిపోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
కాగా, ధాన్యం కేటాయింపులకు అనుగుణంగా మిల్లింగ్ జరిపి బియ్యం నిల్వలను తిరిగి అందించడంలో విఫలమైన రైస్ మిల్లర్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి సంబంధిత అధికారులను ఆదేశించారు. లెవీ లక్ష్యానికి విఘాతం కల్పించిన మిల్లర్లపై అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టును ప్రయోగించాలని అన్నారు. మరో పది రోజుల లోపు తాను ఇదే అంశంపై ప్రత్యేకంగా సమీక్ష జరుపుతానని, ఆ లోపు డిఫాల్ట్ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే పూర్తి వివరాలతో తనకు నివేదికను సమర్పించాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.