ఆర్టీసీ బస్ డిపోలో మెగా హెల్త్ క్యాంప్

by Sridhar Babu |
ఆర్టీసీ బస్ డిపోలో మెగా హెల్త్ క్యాంప్
X

దిశ, కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లు సిబ్బందికి డిపోలో శనివారం వన్ కార్డ్ బిజినెస్ సొల్యూషన్ ఆధ్వర్యంలో అఖిల హాస్పిటల్, నిమ్మస్ డెంటల్ హాస్పిటల్ వారి సహకారంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు డిపో మేనేజర్ ఇందిరా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్ అందజేశారు. అలాగే ఉచితంగా డిస్కౌంట్ కార్డు ఆర్టీసీ సిబ్బందికి అందజేయడం పట్ల డిపో మేనేజర్ వన్ కార్డ్ సిబ్బందిని అభినందించారు.

అనంతరం వన్ కార్డు సిబ్బంది మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 20 వేల కార్డులు ఉచితంగా అందజేయడం జరుగుతుందని, ఈ కార్డుల వల్ల పలు హాస్పిటల్ లో మూడు నెలల వరకు ఉచిత ఓపీ కన్సల్టేషన్ తోపాటు మెడికల్ ల్యాబ్ లో 30 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు పుట్ట మల్లికార్జున్, పుట్ట భవాని, అభిషేక్ రెడ్డి, బస్ డిపో అసిస్టెంట్ మెకానికల్ వసుంధర, లింగమూర్తి, హెల్త్ వాలంటర్స్ కల్పన, ఎల్పి రావు, వన్ కార్డ్ ప్రతినిధులు రవి, రమ్య, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story