రైతుల ధర్నాతో కదిలిన యంత్రాంగం

by Sridhar Babu |
రైతుల ధర్నాతో కదిలిన యంత్రాంగం
X

దిశ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్ లో రైతులు తమకు అడిగిన విత్తనాలు కాకుండా నాసిరకం విత్తనాలు ఇచ్చి అడిగితే పొంతనలేని సమాధానం చెప్తున్నారని ఆగ్రహంతో ధర్నా చేసిన విషయం తెలిసిందే. దాంతో శనివారం అధికార యంత్రాంగం కదిలి వచ్చింది. వ్యవసాయం శాఖ ఏడీఏ వీరస్వామి మన గ్రోమోర్ సెంటర్ తనిఖీ చేసి విత్తనాలకు సంబంధించిన బిల్లులను పరిశీలించి ఫోన్​ ద్వారా గ్రోమోర్ సెంటర్ కు విత్తనాలను సరఫరా

చేసిన కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి సోమవారం రైతులు ఆరోపిస్తున్న సీడ్ కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో పాటు లైసెన్స్ ను తీసుకొని రావాలని ఆదేశించారు. అనంతరం ఫీల్డ్ విజిట్ చెసి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం గ్రోమోర్, విత్తన కంపెనీ వారి నుండి పూర్తి వివరాలు సేకరించి రైతులు నష్ట పోకుండా న్యాయం చేస్తామని అన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏఈఓ లు హస్మా, గౌస్, సందీప్ రైతులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story