ఆశకు పోయి మోసపోయాం ఆదుకోండి..

by Sumithra |   ( Updated:2023-02-13 11:36:40.0  )
ఆశకు పోయి మోసపోయాం ఆదుకోండి..
X

దిశ, నిజామాబాద్ సిటీ : ఆశకు పోయి మోసపోయాం న్యాయం చేయాలని జిల్లాకలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఆర్మూర్, జక్రాన్ పల్లి తదితర మండలాలకు చెందిన లాటరీ బాధితులు, ఏజెంట్లు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలిస్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో సుమారు రూ.5 కోట్లకు పైగా లాటరీ డబ్బులతో ఎంటర్ ప్రై జెస్ నిర్వాహకులు బోర్డ్ తిప్పేశారని అన్నారు. డబ్బులు కట్టిన అమాయక ప్రజలు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వినతిపత్రం అందజేశారు.

ఆశకు పోయి కోట్ల రూపాయలకు మోసపోయామని అలీస్ ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకుల పై ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసామన్నారు. ఎఫ్ఐఆర్ నమోదై 11 నెలలు గడిచిన ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన సుల్తాన్ అలీ అతని భార్య ఫాతిమా డ్వాక్రా గ్రూప్ మహిళా సభ్యురాలుగా అందరినీ మభ్యపెట్టి కల్లబొల్లి మాటలు చెప్పి లాటరీ కట్టించారని అలీస్ ఎంటర్ ప్రై జెస్ పేరుతో ఏజెంట్ల ద్వారా నెలకు వేయి చొప్పున ఒక్కొక్కరి నుండి 16 నెలల కాలపరిమితితో లాటరీ డబ్బులు కట్టించుకున్నరన్నారు.

మొత్తం 2800 మంది సభ్యుల నుండి కోట్లల్లో డబ్బులు కాజేసి బోర్డు తిప్పేసి పరారయ్యాడని బాధితులు వాపోయారు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఆశలతో బహుమతులు వస్తాయని లాటరీ స్కీం కట్టినామన్నారు. మా డబ్బులు మాకు ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్, సీపీ వెంటనే స్పందించి విచారణ చేపట్టి మా డబ్బులు మాకు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని బాధితులు కోరారు. బాధితులు అమర్, ఫిరోజ్, వినోద్, రాధ, సుజాత, మౌనిక, రవి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed