- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరొకరి ఓఎంఆర్ షీట్ లో పరీక్ష రాస్తూ దొరికిన అభ్యర్థి..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీఎస్ పీఎస్ సీ నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ రాత పరీక్షలో పోలీసులు ఒక అభ్యర్థి పై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో 20 పరీక్ష కేంద్రాలలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రాతపరీక్ష జరిగింది. నగరంలోని నాల్గవ టౌన్ పరిధిలో గల బోర్గాం (పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన పరీక్షా కేంద్రంలో తన ఓఎంఆర్ షీట్ బదులు గైర్హాజరైన అభ్యర్థికి సంబంధించిన ఓఎంఆర్ షీట్ లో జవాబులు రాస్తున్న అభ్యర్థిపై పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్ రమేష్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు 4వ టౌన్ ఎస్సై సందీప్ తెలిపారు.
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షకు సహకార శాఖలో క్లర్క్ గా పనిచేస్తున్న అబ్దుల్ ముఖీద్ పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన ఓఎంఆర్ షీట్ లో రాసిన జవాబులు తప్పులు దొర్లడంతో దానిని చించి నమిలేశాడు. అక్కడే గైర్హాజరైన మరో అభ్యర్థికి సంబంధించిన ఓఎంఆర్ షీట్ ఉండడంతో దానిపై జవాబులు రాశాడు. ఉదయం పూట జరిగిన మొదటి స్పెల్ లో ఈ సంఘటన జరిగింది.
ఓఎంఆర్ షీట్లను కలెక్ట్ చేసిన సమయంలో గుర్తించిన అధికారులు ఈ విషయాన్ని సూపరింటెండెంట్ కు సమాచారం అందించారు. ఆయన 4వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్దుల్ ముఖీద్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తనకు కేటాయించిన ఓఎంఆర్ షీట్ లో తప్పులు దొర్లడంతో టీఎస్ పీఎస్ సీ నెగిటివ్ మార్కులను పరిగణలోకి తీసుకుంటుందని తానే తన ఓఎంఆర్ షీట్ ను చించి నమిలేసినట్లు తెలిపారు. ఇతరుల ఓఎంఆర్ షీట్ లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడింది వాస్తవమేనని ఒప్పుకోవడంతో మాల్ ప్రాక్టీస్ కేసునమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.