- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్..
దిశ, ఆర్మూర్ : టీపీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాదులోని గాంధీభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల సమక్షంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు భారీ సంఖ్యలో హైదరాబాదులోని గాంధీభవన్ కు తరలి వెళ్లారు.
అక్కడ ముందుగా టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించబోయే మహేష్ కుమార్ గౌడ్ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి, ర్యాలీగా గాంధీ భవన్ కి వెళ్లారు. హైదరాబాద్ తరలి వెళ్లిన వారిలో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, ఆర్మూర్ మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ మేడిదాల సంగీత రవి గౌడ్, మాక్లూర్ మండలం గొట్టుముక్కల మాజీ సర్పంచ్ దారం రవీందర్ , మెట్పల్లి మాజీ సర్పంచ్ చిన్నారెడ్డి సాయిలు తదితరులు ఉన్నారు.