Govt Hospital : ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ..

by Kalyani |
Govt Hospital : ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ..
X

దిశ ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ఆర్మూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి మహర్దశ పట్టనుంది. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి నలుగురు వైద్యులను, 22 స్టాఫ్ నర్సులను, ఒక సీనియర్ అసిస్టెంట్ లను కేటాయిస్తూ ఆరోగ్యశాఖ నుండి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్మూర్ ప్రాంత ప్రజల ఆరోగ్యరీత్యా వైద్యులను కేటాయించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కోరారు. ఆర్మూర్ నియోజకవర్గం అంకపూర్ గ్రామంలో లాలన వృద్ధ ఆశ్రమానికి వచ్చిన సందర్భంలో.. హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో కలిసి వినయ్ రెడ్డి విన్నవించారు.

ఈ సందర్భంగా వైద్య విధాన పరిషత్ లో ఉన్న ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రిని అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకురావాలని మంత్రిని వినయ్ కుమార్ రెడ్డి కోరారు. అలాగే ఈ మధ్య జరిగిన వైద్యుల బదిలీలో ఆర్మూర్ నుంచి వైద్యులు ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు బదిలీ అయి వెళ్లారని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చూడాలన్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి స్పందిస్తూ ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి 4 గురు వైద్యులను నియమిస్తూ ఆరోగ్య శాఖ ద్వారా శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

దీంతో ఆర్మూర్ దావఖానలో ఇదివరకు కీళ్లు, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ అమృతరామ్ రెడ్డిని తిరిగి ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. చాతి వైద్య నిపుణులు డాక్టర్ బల్వీర్ సింగ్, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ స్నేహ, దంత వైద్యులు డాక్టర్ సతీష్ లను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మంత్రి వైద్యులనే కాక ఆసుపత్రికి సంబంధించిన 22 మంది స్టాఫ్ నర్సలని, ఒక సీనియర్ అసిస్టెంట్ ను కూడా ఆర్మూర్ ఆస్పత్రికి కేటాయించారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులను, వైద్య సిబ్బందిని కేటాయించడం పట్ల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.



Next Story

Most Viewed