- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
పిల్లలతో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్న స్టార్ కపూల్.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ పిక్స్
దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ‘లక్ష్మి’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఈమె తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం వంటి భాషల్లో నటించి తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అలాగే లేడీ ఓరియేంటెడ్ మూవీస్ చేస్తూ లేడీ సూపర్ స్టార్‌గా నిలుస్తోంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరోగసి ద్వారా ఇద్దరు బాబులకు తల్లి కూడా అయింది. ఇక అప్పటి నుంచి నిత్యం సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వీరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా నయన్ తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో నయనతార, శివన్ తన కొడుకులతో (ఉయిర్, ఉలగ్) కలిసి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్న క్యూట్ పిక్స్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు.. క్యూట్ పిక్స్ అని, హ్యాపీ వినాయక చవితి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.