Harish Shankar: హరీష్ శంకర్ డైరెక్షన్ లో చిరు కొత్త కమర్షియల్ యాడ్

by Prasanna |
Harish Shankar: హరీష్ శంకర్ డైరెక్షన్ లో చిరు కొత్త కమర్షియల్ యాడ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు మెగాస్టార్ మూవీ వస్తుందంటే చాలు ముందు రోజు నుంచే టికెట్స్ కోసం ఎగబడేవారు.. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకెళ్తున్నాడు. అంతేకాకుండా, ఇప్పుడున్న యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడనే చెప్పుకోవాలి. అంతకముందు చిరు ఎక్కువ కమర్షియల్ యాడ్స్ లో నటించేవాడు. అప్పట్లో థమ్స్ అప్, నవరతన్ ఆయిల్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. రీ ఎంట్రీ తర్వాత యాడ్స్ పక్కన పెట్టారు. కానీ,

తాజాగా ఓ యాడ్ లో చిరు మెరిశారు. వినాయక చవితి సందర్భంగా దీనిని విడుదల చేశారు. ఈ యాడ్ కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. దీని కోసం క్లాస్ అండ్ మాస్ లుక్ లో కనిపించి అభిమానులను అందర్ని అలరించారు. 70 ఏళ్ళు దగ్గర పడుతున్న కూడా అదే గ్రేస్ అదే ఊపు .. కొంచం కూడా తగ్గలేదని ఈ యాడ్ తో నిరూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. మొత్తానికి చాలా యేళ్ల తర్వాత చిరు కమర్షియల్ యాడ్ లో కనిపించి అందర్ని ఆకట్టుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed