- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన మాచారెడ్డి వైస్ ఎంపీపీ..
దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని వైస్ ఎంపీపీ జీడిపల్లి నరసింహారెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్, ఎంపీపీ లోయపల్లి నర్సింగరావుల ఆదేశాల మేరకు కస్తూర్బా పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా 28 లక్షల 50,000 రూపాయలు నిధులను కామారెడ్డి ఎమ్మెల్యే గుంత గోవర్ధన్ మంజూరు చేయించారు. అభివృద్ధి పనులలో నాణ్యత లోపించకూడదని కాంట్రాక్టర్ కు ఆయన సూచించారు.
మెనూ ప్రకారం విద్యార్థినిలకు పౌష్టికాహారం అందించాలని ఆయన సూచించారు. విద్యార్థి మానసిక ఉల్లాసానికి తరగతి గదులను వెలుతురు వచ్చేటట్టు చూడాలని, నాణ్యమైన విద్యను అందించాలని, వాటర్ సౌకర్యం, మరుగుదొడ్లలో పరిశ్రుభ్రత పాటించాలన్నారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్, సొసైటీ డైరెక్టర్ రంగుల సావిత్రి కాశిరెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మద్దెల రాజు, సర్పంచ్ లింగారెడ్డి, ఎంపీటీసీ ఏలేటి విజయలక్ష్మి గంగారెడ్డి, తండా ఉపసర్పంచి రవి నాయక్, గంగని రాములు, ప్రిన్సిపాల్ మైశ కళ, ఉపాధ్యాయునులు మమత సిబ్బంది పాల్గొన్నారు.