- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాచారెడ్డి ఎంపీటీసీ ఇంటి పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి..
దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి గ్రామ ఎంపీటీసీ రావుల వినోద ప్రభాకర్ రావుల ఇంటి పై ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. 100కు డయల్ చేసి తమ ప్రాణాలు రక్షించుకున్నట్లు ఎంపీటీసీ రావుల వినోద ప్రభాకర్ రావు దంపతులు మీడియా సమావేశంలో వెల్లడించారు. (మాచారెడ్డి ఎక్స్ రోడ్) ప్రస్తుతం గజ్యానాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని చెరువు శిఖం భూమిని మాచారెడ్డి గ్రామానికి చెందిన కల్లు మూస్తేదర్ పంపరి నర్సాగౌడ్ అనే వ్యక్తి కబ్జాకు పాల్పడ్డాడు.
ఈ విషయమై ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ మాచారెడ్డి ఎంపీటీసీ రావుల వినోద భర్త ప్రభాకర్ రావు కలెక్టర్ ఫిర్యాదు చేశాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఫోన్లో సుపారి మాట్లాడానని, చంపుతామంటూ పంపరి నర్సాగౌడ్ కొడుకు దేవరాజు గౌడ్ బెదిరించినట్లు వారు వివరించారు. ఆదివారం రాత్రి ఫోన్లో మాట్లాడుతుండగానే తమ ఇంటి పై దాడి జరిగిందని వివరించారు. తమ ఇంట్లో అద్దెకు నివాసముంటున్న వారి గది తలుపులు ధ్వంసం చేసినట్లు తెలిపారు.
గజ్యా నాయక్ తాండ పరిధిలో ఎన్నో భూకబ్జాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని, పేదల భూములను కబ్జాదారుల నుండి కాపాడాలని తన భర్త పేదల పక్షాన నిలబడినందుకు తమ పై దాడులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి తమకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని ఎంపీటీసీ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.