తక్షణమే లారీలను ఏర్పాటు చేయాలి

by Sridhar Babu |
తక్షణమే లారీలను ఏర్పాటు చేయాలి
X

దిశ, భిక్కనూరు : ధాన్యాన్ని తరలించేందుకు తక్షణమే లారీలను అరెంజ్ చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్ ట్రాన్స్ పోర్ట్ ఆపరేటర్లను ఆదేశించారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబుతో కలిసి విజిట్ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం రైతులతో మాట్లాడి వారి సాధక బాధకాలను తెలుసుకున్న వారు అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడవకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైన టార్ఫాలీన్ల ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయించాలని కొనుగోలు కేంద్రాల ఇన్ చార్జ్ లను ఆదేశించారు. ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలను సమకూర్చాలన్నారు.

అక్కడి నుంచి పాల్వంచ మండలం ఫరీద్ పేట గ్రామానికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం రాసులు అధికంగా ఉండడంతో తక్షణమే రైస్ మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసే విధంగా 10 లారీలను సమకూర్చాలని ట్రాన్స్ పోర్ట్ ఆపరేటర్ ను ఆదేశించారు. అక్కడి నుంచి మాచారెడ్డి మండలం లచ్చ పేట కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. 900 బస్తాల ధాన్యం అందుబాటులో ఉందని, వాటిని వెంటనే రవాణా చేసేందుకు అవసరమైన లారీలను పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీటి వసతి కల్పించడంతోపాటు, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. మిల్లులకు పంపిన ధాన్యాన్ని వెంటనే అన్ లోడ్ చేసే విధంగా చూడాలని మిల్లర్లను ఆదేశించారు. వారి వెంట జిల్లా పౌర సరఫరాల ఇంచార్జ్ మేనేజర్ నిత్యానందం, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్లు కిష్టయ్య, శ్రీనివాస్, సొసైటీ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed