- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మద్యం ధరలకు రెక్కలు.. గుప్పు మంటున్న గుడుంబా..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ ఎక్సైజ్ పోలిసులు సోమవారం తెల్లవారు జామున ఎర్గట్ల మండలం బట్టాపూర్ తండాలో సోదాలు నిర్వహించారు.సీఐ గుండప్ప ఆధ్వర్యంలో దాడి నిర్వహించి లాల్య నాయక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 5 లీటర్ల గుడుంబాను స్వాధినం చేసుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలో గుడుంబా గుప్పు మంటుంది. ఇటివల ప్రభుత్వం మద్యం ధరలను పెంచడంతో చాల మంది దేశిదారు లేదా గుడుంబా సేవించడానికి అసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన మద్యం దుకాణాలలో చీప్ లిక్కర్ క్వార్టర్ ధరలోనే పల్లెలలో, తాండాలలో లీటర్ గుడుంబా దోరుకుతుండటంతో మందు బాబులు మళ్లి సారా వైపు మళ్లుతున్నారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పొడువున దేశి దారు తరలివస్తుండటంతో చాల మంది తెలంగాణ మద్యం కంటే మహరాష్ర్ట నుంచి చీప్ గా దొరికే చీఫ్ లిక్కర్ ను కోనుగోలు చేసి సేవిస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రతి ఎక్సైజ్ పోలిస్ స్టేషన్ లలో నెలకు 5 కేసులకు తక్కువగా కాకుండా గుడుంబా కేసులు నమోదు అవుతున్నాయంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతుంది.
అధికారికంగా అయ్యే ఎఫ్ఐఆర్ లు అంతా ఉండగా కేసులు కానివి ఎన్ని అనే ప్రశ్నతలెత్తుతుంది. ఇంకా లోకల్ పోలిస్ స్టేషన్ కేసుల సంఖ్య వేరుగా ఉండటంతో నిజామాబాద్ జిల్లాలో గుడుంబా గుప్పుమంటుందని చెప్పాలి. 2018 కి పూర్వం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గుడుంబా తయారికి విక్రయాలకు ఫేమస్. ఉమ్మడి జిల్లాలోని 10 అబ్కారి పోలిస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతాల పరిధిలోని తండాలలో, పల్లెలలో కాపు సారా తయారి చేసి విక్రయించేవారు గిరిజనులు.
తరువాత కాలంలో నల్లబెల్లం, ఇతర రసాయినాలను కలిపి గుడుంబా తయారి జరుగుతుండేది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం, ఉప్పర్ టేక్డి, గాజుల్ పేట్, మిర్చి కంపౌండ్ ప్రాంతాలలో గుడుంబా క్రయ విక్రయాలు బహిరంగంగా జరిగేవి. 2018లో రెండో ధఫా అధికారంలోకి వచ్చిన తెలంగాణ సర్కార్ గుడుంబాపై ఉక్కుపాధం మోపింది.
చాలమందిపై కేసులు పెట్టి జైలుకు పంపారు. దానికి తోడు చాల మందికి పునరావస చర్యలను చెపట్టింది. ఇక ముందు గుడుంబా విక్రయాలు చేయవద్దని చాల మంది తయారిదారులను విక్రేతలను బైండోవర్ చేశారు. గుడుంబా తో ఉపాధి పోందుతున్న వారికి బర్రెలు, గొర్రెలు, ఆటోలను ఇచ్చి గుడుంబా క్రయ విక్రయాలకు వారిని దూరం చేసి నిజామాబాద్ జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించారు.
ప్రభుత్వానికి జీవం లాంటి మద్యం అమ్మకాలను పెంచేందుకు అబ్కారి పోలిస్ ల మెడపై కత్తి వేలాడుతుంది. వైన్స్, బార్, పర్మీట్ రూ, దాబా, బెల్ట్ షాపు అని పేరు ఎదైనా సరే మద్యం అమ్మకాలు పెరుగాలి. ప్రభుత్వం అధికారికంగా రెండు వ్యవస్థలకు లకు లైసెన్స్ మంజూరు చేసిన అనాధికారికంగా మద్యం పెరుగుదలకు దోహద పడే దాబాలు, పర్మీట్ రూంలు, బేల్ట్ షాపులకు ప్రోత్సహిస్తుందనేది బహిరంగ రహస్యం.
అయితే పులిమీద పుట్రల ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాడానికి మద్యం ధరలను పెంచడంతో చాల మంది మళ్లి దేశీదారు, గుడుంబా వైపు మొగ్గు చూపుతున్నారు. దానితో మద్యం విక్రయాలపై ప్రభావం పడటంతో మద్యం క్రయ విక్రయాల ఆధారంగా అబ్కారి అధికారులు దాడులను పెంచారు. ఎక్సైజ్, ఎన్ పోర్స్ మెంట్, టాస్క్ పోర్స్ ప్రత్యేక నజర్ వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం గుడుంబా తయారి, విక్రయాదారులు చాలమంది గతంలో బైండోవర్ చేసి ఉండటం అబ్కారి అధికారులకు తల నొప్పిగా మారింది.
పునరావాసం పొందిన మారకుండా మళ్లి గుడుంబా తయారి, విక్రయాలు చేస్తుండటంతో వారిని అరెస్టు చేసి రిమాండ్ పంపాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రతి నెల ఒక్కో స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసులలో అరెస్టులతో పాటు గుడుంబ ధ్వంసం చెయ్యడంపై అబ్కారి శాఖకు పని పెరిగింది.